ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేసింది. ఈ ప్రభావం క్రికెట్‌ను కూడా బాగా తాకింది. ఐపీఎల్‌తో పాటు ఎన్నో క్రికెట్ టోర్నమెంట్‌లను పటిష్టమైన బయోబబుల్‌లో నిర్వహించారు. క్రికెటర్లను హోటళ్లకే పరిమితం చేసి, స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న కొందరి అజాగ్రత్త వల్ల గతేడాది ఐపీఎల్ కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయింది. అంతేకాకుండా పలు క్రికెట్ సిరీస్‌లు వాయిదా పడ్డాయి. అలాంటి వాటిలో ఇంగ్లాండ్-భారత్ టెస్టు సిరీస్ కూడా ఉంది. అందులో జరిగిన 4 మ్యాచ్‌లలో భారత్ రెండు విజయాలు సాధించగా, ఇంగ్లాండ్ ఒక విజయం సాధించింది.

 మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కరోనా కారణంగా వాయిదా పడిన ఆఖరి టెస్టును ఆడేందుకు టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ వెళ్లింది. అయితే చిక్కంతా ఇక్కడే వచ్చి పడింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఐపీఎల్ ముగిసిన వెంటనే సౌతాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్ ఆడింది. అందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చారు. దీంతో తన భార్య అనుష్క శర్మతో కలిసి కోహ్లి మాల్దీవ్స్‌కు విహార యాత్ర నిమిత్తం వెళ్లాడు. అక్కడి నుంచి వచ్చేపాటికి ఆయనకు కరోనా సోకింది. అది తగ్గడంతో మిగిలిన జట్టు సభ్యులతో కలిసి కోహ్లి ఇంగ్లాండ్ వెళ్లాడు. అదే సమయంలో అశ్విన్‌కు కరోనా రావడంతో ఇండియాలోనే ఉండిపోయాడు. ఇక ఇంగ్లాండ్ వెళ్లిన కోహ్లి అక్కడ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. షాపింగ్ చేస్తూ, స్థానికులతో ఫొటోలు దిగుతున్నాడు. బయటకు వెళ్లినప్పుడు కనీసం ఫొటో కూడా పెట్టుకోవడం లేదు. జట్టులో ఏ ఒక్కరు కరోనా బారిన పడినా ఆ ప్రభావం అందరిపైనా ఉంటుంది.

 మిగిలిన వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ పర్యటనకు ముందు కరోనా బారిన పడిన కోహ్లి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనిపై బీసీసీఐ కూడా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు మాస్కు కూడా పెట్టుకోకుండా ఇంగ్లాండ్‌లో కోహ్లి బయట స్వేచ్ఛగా తిరుగుతుండడంపై నెటిజన్లు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: