కాని రోహిత్ శర్మ తన కెప్టెన్సీ వ్యూహాల తో అందరి అంచనాలను మరో సారి తారుమారు చేసేశాడు. ఏకంగా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఈ క్రమం లోనే భారత బౌలర్లు విజృంభించడం తో అటు ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగం మొత్తం పేకమేడలా కూలి పోయింది. ఈ క్రమం లోనే 111 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లాండ్ జట్టు చివరి ఆలౌట్ అయింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన టీమిండియా మరింత అదరగొట్టింది.
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా బరిలోకి దిగగా ఎంతో ఆడుతూపాడుతూ 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించారు. 18.4 ఓవర్లలో నే టార్గెట్ రీచ్ అయ్యారు. అయితే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా భారత జట్టు లక్ష్యాన్ని చేధించడం గమనార్హం. అయితే ఇంగ్లండ్ జట్టు పై ఇంత ఘన విజయం సాధించడం ఇదే మొదటి సారి. ఒక్క వికెట్ కోల్పోకుండా ఇంగ్లాండ్ నిర్దేశించిన టార్గెట్ ను చేధించిన టీమిండియా అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. కాగా రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించాడు.శిఖర్ ధావన్ 31 పరుగులు చేశాడు. పది వికెట్ల తేడాతో భారత జట్టుకు విజయం వరించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి