ప్రతి ఏడాది ఐసిసి లెజెండ్స్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంతోమంది దిగ్గజ క్రికెటర్ లు ఈ లీగ్ లో భాగం అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ క్రికెట్కు దూరమైన వారు మరోసారి జట్టుగా ఏర్పడి మైదానంలోకి దిగి తమ ప్రత్యర్థులతో మరోసారి పోటీ పడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఐసిసి నిర్వహించే లెజెండ్స్ క్రికెట్ లీగ్  ప్రేక్షకులందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది.


 ఒకప్పుడు క్రికెట్ లో అదరగొట్టి ఇక ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత క్రికెట్కు దూరమైన వారు ఆటను మళ్లీ చూసేందుకు అవకాశం ఉంటుందని భావించి ఇక ప్రతి మ్యాచ్ నూ కూడా వదలకుండా వీక్షిస్తూ ఉంటారు. కాగా ఇక ఈ ఏడాది లెజెండ్స్ క్రికెట్ లీగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకూ ఒమాన్ వేదికగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అయితే తొలి సీజన్లో వీరేంద్ర సెహ్వాగ్, పఠాన్ బ్రదర్స్,  మొహమ్మద్ కైఫ్ సహా  పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు జట్టుగా ఏర్పడి క్రికెట్ ఆడారు.


 అయితే ఇక ఈ లెజెండ్స్ క్రికెట్ లీగ్లో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాల్గొంటున్నాడు అన్న వార్తలు గత కొన్ని రోజుల నుండి హాట్ టాపిక్ గా మారిపోయాయ్. లెజెండ్ క్రికెట్ లీగ్ టోర్నీ రెండో సీజన్లో సౌరవ్ గంగూలీ ఆడతాడు అని గతంలో నిర్వాహకులు కూడా ప్రకటించారు. ఇటీవలే సౌరవ్ గంగూలీ ఈ వార్తలపై స్పందించాడూ. తాను లెజెండ్ క్రికెట్ లీగ్లో భాగం కావడం లేదు అంటూ స్పష్టం చేశాడు. అలాంటి వార్తలను అవాస్తవం అంటూ  కొట్టి పారేసాడు సౌరవ్ గంగూలీ. దీంతో సౌరవ్ గంగూలీ ఆటను మరోసారి చూడాలనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సెకండ్ ఎడిషన్ లో లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో ఎవరు ఆడబోతున్నారూ అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: