పాకిస్తాన్లో కాకుండా తటస్థ వేదికపై అటు ఆసియా కప్ నిర్వహిస్తేనే తాము ఆసియా కప్ లో పాల్గొంటాము అంటూ ఇప్పటికే అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఎంతోమంది పాక్ మాజీ ఆటగాళ్లు సైతం తప్పుపట్టారు. అంతే కాకుండా ఇదే విషయాన్ని తెరమీదకి చేస్తూ తరచూ విమర్శలు గుప్పించడం పరిపాటిగా మారి పోయింది అని చెప్పాలి. ఇక గత కొంతకాలం నుంచి బీసీసీఐపై తన అక్కస్సును వెళ్లగకుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమిజ్ రజా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
పాకిస్తాన్లో జరిగే ఆసియా కప్ లో భారత జట్టు ఆడటంపై తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సరైన దృష్టి సారించడం లేదు అంటూ రమిజ్ రాజా వ్యాఖ్యానించాడు. ఎందుకంటే ఐసీసీకి బీసీసీఐ నిధులు నుంచి ఎక్కువ నిధులు వస్తూ ఉంటాయి. అందుకే ఐసీసీ ఇక బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పై రాజి పడుతుంది. నిబద్ధత ఉంటే తప్ప ఐసీసీ మారుతుందని అనుకోవడం లేదు అంటూ రిమీజ్ రాజా ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పైనే విమర్శలు చేయడం గమనార్హం. అయితే రమిజ్ రాజా ఎంత మొత్తుకున్నా అటు అతని వ్యాఖ్యల పై స్పందించే వారు లేకుండా పోయారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి