నాలుగో మ్యాచ్ లో కూడా గెలిచి సొంత గడ్డపై భారత జట్టు ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ రీతిలో ఊహించని భారత మహిళల జట్టుకు చేదు అనుభవమే ఎదురయింది అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవలే జరిగిన నాలుగవ టి20 మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఓడిపోయింది అని చెప్పాలి. దీంతో సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలి అనుకున్న ఆశ మాత్రం భారత జట్టుకు నెరవేరలేదు.
ఇకపోతే నాలుగో టీ20 మ్యాచ్ లో ఓడి పోయి ఇక సిరిస్ కోల్పోవటం పై భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓటమికి 18 ఓవర్ కారణం అంటూ చెప్పింది. ఏకంగా 18 ఓవర్లో మా జట్టు కేవలం మూడు పరుగులు మాత్రమే చేసింది. అప్పటి వరకు మ్యాచ్ మొత్తం మేం పోటీ లోనే ఉన్నాం. కానీ 18 ఓవర్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేయడం కారణం గా ఒకసారిగా పరిస్థితులు ఆస్ట్రేలియా వైపు వెళ్ళి పోయాయి అంటూ చెప్పుకొచ్చింది హార్మన్ ప్రీత్ కౌర్. కాక నాలుగవ టి20 మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో ఓడిపోయింది టీమిండియా జట్టు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి