ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత ఒక్కసారిగా ఐపీఎల్ ప్రేక్షకులు అందరికీ రింకు సింగ్ హీరోగా మారి పోయాడు అని చెప్పాలి. అతని ఇన్నింగ్స్ విశ్వవ్యాప్తమైంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని ప్రతి ఇన్నింగ్స్ చూసేందుకు అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తి కనపరుస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక అతని గురించి తెలుసుకోవడానికి కూడా మొగ్గు చూపారు అన్న విషయం తెలిసిందే. అయితే రింకు సింగ్ క్రికెట్లో హీరో మాత్రమే కాదు నిజజీవితంలోనూ హీరో లాంటి మనసున్న వాడు అన్నది ఇక్కడ ఒక విషయం తెరమీదకి వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతుంది.
రింకు సింగ్ పేదరికం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని క్రికెటర్గా ఎదిగాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక తనలాగే పేదరికంలో మగ్గుతూ క్రికెట్ మీద ప్రేమ ఉన్న క్రికెటర్లకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యాడు రింకు సింగ్. వచ్చే నెలలో ఉత్తర ప్రదేశ్ లోని ఆలీ ఘర్ లో ఇక పేదరికంలో ఉన్న క్రికెటర్ల కోసం ఒక ప్రత్యేకమైన హాస్టల్ ఏర్పాటు చేసేందుకు రింకు సింగ్ నిర్ణయించుకున్నాడట. తద్వారా క్రికెట్ ఫ్యాషన్ గా బ్రతికే పేద క్రికెటర్లకు అండగా నిలువాలని గొప్ప ఆలోచన చేశాడట రింకు సింగ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి