కానీ ఇటీవల కాలంలో ఏకంగా వరల్డ్ క్రికెట్లో మేటి జట్లుగా పేరు ఉన్న టీమ్స్ కాకుండా పసికూన టీమ్స్ సైతం ఎన్నో వరల్డ్ రికార్డులు క్రియేట్ చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇలాంటి రికార్డులు ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాయ్. ఇక్కడ మరో అనామక జట్టు ఇలాంటి ఒక అరుదైన రికార్డు సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయడమే కాదు ఆ తర్వాత ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేసి వన్డే క్రికెట్ హిస్టరీలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం కూడా ఈ విక్టరీ గురించే చర్చించుకుంటున్నారు. ఐసీసీ అండర్ 19 పురుషుల వరల్డ్ కప్ అమెరికా క్వాలిఫైయర్స్ లో భాగంగా యూఎస్ఏ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 515 పరుగులు చేసింది యూఎస్ఏ టీం. అయితే కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన అర్జెంటీనా టీం మాత్రం ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది. 19.5 ఓవర్లలో కేవలం 65 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో యుఎస్ఏ జట్టు 450 పరుగుల తేడాతో విజయం సాధించింది. వన్డే క్రికెట్ హిస్టరీలో ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. అదే సమయంలో అండర్ 19 క్రికెట్ లో 515 పరుగులే ఇప్పటివరకు అత్యధిక స్కోరు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి