అయితే వరల్డ్ క్రికెట్లో బెస్ట్ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు సంపాదించుకున్న మహేంద్రసింగ్ ధోని సారథ్యంలో ఒక్క మ్యాచ్ అయిన ఆడాలని ప్రతి ఒక్క యంగ్ ప్లేయర్ కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ధోని ఆటను దగ్గర నుంచి చూస్తే కెరియర్ కు సరిపడా అనుభవాలు దొరుకుతాయి అని ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ ఆశపడుతూ ఉంటారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా ఎంతో మంది యువకులు ఐపిఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా మాత్రం కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ కి ధోని లాంటి లెజెండ్ కెప్టెన్సీలో ఆడే అవకాశం దొరుకుతుంది అని చెప్పాలి. దీంతో ఇక ధోని నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుని అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడటం వల్ల తాను ఎంతో నేర్చుకున్నాను అంటూ చెబుతున్నాడు శ్రీలంక యంగ్ బౌలర్.
2023 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు శ్రీలంక బౌలర్ పతిరణ. ఇక తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను లెజెండరీ క్రికెటర్ ధోని నుంచి చాలా నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ధోని నాపై పూర్తి నమ్మకం ఉంచాడు. జట్టులో అందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడు అంటూ పతిరణ తెలిపారు. ధోని ఫిట్నెస్ నిజంగా స్ఫూర్తిదాయకం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సీఎస్కే క్యాంపులో ఎన్నో విషయాలను నేర్పించారు అంటూ తెలిపాడు. కాగా ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్ లో ఆడుతూ ఉన్నాడు పతిరణ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి