పృథ్వీ షా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ ప్లేయర్ గా ఇప్పటికే చాలా రికార్డులు బద్దలు కొట్టాడు. కానీ జట్టులో ఇంకా అతని స్థానాన్ని నిలుపుకోలేకపోతున్నాడు. తాజాగా జరిగిన ఐపిఎల్ లో కూడా పృథ్వీ షా రాణించలేకపోయాడు. కానీ ఐపిఎల్ తరువాత పృథ్వీ షా ఫుల్ ఫామ్ అందుకున్నాడు. లండన్ వన్డే కప్-2023 లో అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఒక డబుల్ సెంచరీలో విధ్వంసం సృష్టించాడు. డబుల్ సెంచరీతో పాటు ఒక సెంచరీ కూడా కొట్టి భీకర ఫామ్ లో ఉన్నాడు. వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఫామ్ లో పృథ్వీ షా డర్హమ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు.
అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో షా జట్టు నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్నీ జట్టు అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఇది నిజంగా బాధాకరం.. రాయల్ లండన్ వన్డే కప్ తదుపరి మ్యాచ్‌లకు పృథ్వీ షా అందుబాటులో ఉండడు. డర్హమ్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ షా గాయపడ్డాడు అని తెలిపింది. షా త్వరలోనే లండన్‌లో బీసీసీఐ ఆధ్వర్యంలోని స్పెషలిస్ట్ డాక్టర్ ని కలుస్తాడని, కానీ మంచి ఫామ్ లో ఉన్న షా జట్టుకు దూరం కావడం నార్తంప్టన్‌షైర్‌పై తీవ్ర ప్రభావం చూపాడు అంటూ ఆ జట్టు కోచ్ జాన్ సాడ్లర్ పోస్ట్ లో రాసుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి