ఇటీవల కాలంలో అందరికీ అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా.. సెలబ్రిటీలకు కామన్ ఆడియన్స్ కు ఉన్న మధ్య దూరాన్ని పూర్తిగా తగ్గించేస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పోర్ట్స్ సెలబ్రిటీలు కూడా అటు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనె కొంతమంది కేవలం ప్రొఫెషనల్ విషయాలు మాత్రమే షేర్ చేసుకుంటే ఇంకొంతమంది పర్సనల్ విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.  అయితే ఇండియాలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి ఎవరు అంటే అందరూ విరాట్ కోహ్లీ పేరు చెబుతారు అందరూ.


 ప్రస్తుతం టీం ఇండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఎప్పుడూ తన పర్సనల్ విషయాలను ప్రొఫెషనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ చేసిన పని అటు బీసీసీఐ కి కోపం తెప్పించింది. అంతేకాదు విరాట్ కోహ్లీ చేసిన పని కారణంగా ఏకంగా ఇతర ఆటగాళ్లకు కూడా బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అని చెప్పాలి. ఇంతకీ ఏమి జరిగిందంటే ఈనెల 30వ తేదీ నుంచి ఆసియా కప్ జరగబోతుంది. ఈ క్రమంలోనే ఇక ఆసియా కప్ కోసం ఎంపికైన ప్లేయర్లకు బీసీసీఐ స్పెషల్ క్యాంప్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఫిట్నెస్ టెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి.


 ఫిట్నెస్ టెస్ట్ లో భాగంగా మొదటి రోజు యోయో టెస్ట్ నిర్వహించగా.. ఇందులో క్వాలిఫై అయినట్లు విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ లో తెలిపాడు. అంతేకాదు ఇక ఈ యోయో టెస్ట్ లో 17.2 పాయింట్లు స్కోరు సాధించాను అన్న విషయాన్ని కూడా వెల్లడించాడు. అయితే నిబంధనల ప్రకారం యోయో టెస్ట్ స్కోర్ బయటకు చెప్పకూడదు. కానీ కోహ్లీ అలా చేయడంతో ఇక రూల్స్ అతిక్రమించినట్లు అయింది. ఈ క్రమంలోనే బిసిసిఐ విరాట్ కోహ్లీ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కోహ్లీ లాగా మిగతా ఆటగాళ్లు ఎవరూ కూడా యోయో టేస్ట్ లో వచ్చే పాయింట్స్ ని బయటకు చెప్పకూడదు అంటూ అందరికీ వార్నింగ్ ఇచ్చింది బీసీసీఐ.

మరింత సమాచారం తెలుసుకోండి: