ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా నువ్వానేనా అన్నట్లుగా ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది అని చెప్పాలి. అయితే మ్యాచ్లు ఇలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సమయంలో అటు వరుణుడు మాత్రం తరచూ ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నాడు. మొదటి మ్యాచ్ నుంచి నిన్నటి మ్యాచ్ వరకు కూడా ఇలా వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోతున్న పరిస్థితి కనిపించింది. ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూసిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఇలాగే వర్షార్పణం అయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా మ్యాచ్లో నిర్వహణ విషయంలో వర్షం కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఇక ముందుగా పల్లకిల్లే, కొలంబో వేదికలలో నిర్వహించాల్సి ఉన్న మ్యాచ్ లను ఇక వేరే వేదికలకు మార్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
అయితే నిజంగానే ఆసియా కప్ మ్యాచ్ల నిర్వహణ విషయంలో అటు ఎసిసి ఇలాంటి అడుగుల వేస్తుంది. ప్రస్తుతం గ్రూప్ మ్యాచ్ లకి వర్షం ఆటంకం కలిగిస్తూ ఉండడంతో.. సూపర్ ఫోర్ మ్యాచ్ లు జరిగే వేదికలను మార్చాలని చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే కొలంబోలో జరగాల్సిన బాధ్యులను హంబన్ టోట స్టేడియానికి మార్చినట్లు తెలుస్తోంది. అయితే పాకిస్తాన్లో జరిగే మ్యాచ్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదట. కాగా కొలంబోలో గత కొన్ని రోజుల నుంచి వర్షం వస్తున్న నేపథ్యంలో మ్యాచ్ లకు ఇబ్బంది కలుగుతుండడంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి