దీంతో ఇక వరల్డ్ కప్ లోనే ప్రతి మ్యాచ్ లోని ఉత్కంఠను ఎంజాయ్ చేయడానికి ప్రేక్షకులు కూడా సిద్ధంగానే ఉంటున్నారు. ఇకపోతే నేడు ప్రపంచకప్ టోర్నీలో భాగంగా రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. ఇక సెమి ఫైనల్ లో అడుగుపెట్టబోయే జట్లు ఏవి అనే విషయంపై నేడు జరగబోయే రెండు మ్యాచ్లతో దాదాపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పాలి.ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలబడబోతుందని అని చెప్పాలి. అయితే ఇప్పటికే పాకిస్తాన్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వరుసగా నాలుగు ఓటములతో దారుణంగా విమర్శలు ఎదుర్కొంది. ఇక ఇటీవల బంగ్లాదేశ్ పై విజయంతో కాస్త ఉపశమనం పొందింది.
అదే సమయంలో మొదట్లో వరుస విజయాలు సాధించి ఇప్పుడు హట్రీ ఓటములతో సతమతమవుతుంది న్యూజిలాండ్. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ఉంది అని చెప్పాలి. అయితే ఈరోజు మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచింది అంటే నాలుగు టీమ్లకు కూడా సెమీఫైనల్ రేస్ నుంచి నిష్క్రమిస్తాయి. పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ 10 పాయింట్లు సాధించలేవు కాబట్టి ఇక దాదాపు వరల్డ్ కప్ టోర్ని నుంచి నిష్క్రమిస్తాయి. అప్పుడు ఆఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా మాత్రమే సెమీఫైనల్ రేసులో ఉంటాయి. అయితే భారత్ ఇప్పటికే సెమీఫైనల్కు క్వాలిఫై అవ్వగా.. సౌత్ ఆఫ్రికాకు కూడా దాదాపు సెమీస్ బెర్త్ ఖాయమైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి