అలాంటి సౌత్ఆఫ్రికా ఇటీవలే భారత్ చేతిలో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. అయితే భారీ స్కోర్ చేస్తూ వరుస విజయాలు నమోదు చేస్తూ దూసుకు వస్తుంది సౌత్ ఆఫ్రికా. ఇక వరుస విజయాలతో తమకు తిరుగులేదు అని నిరూపిస్తున్న ఇండియాకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అని క్రికెట్ విశ్లేషకులు అందరూ కూడా అంచనా వేశారు. కానీ సొంత గడ్డమీద తమకు తిరుగులేదు అన్న విషయాన్ని మరోసారి నిరూపించింది భారత జట్టు. ఏకంగా సౌత్ ఆఫ్రికా పై 243 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. భారత బౌలింగ్ దాటికీ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ విభాగం మొత్తం పేక మెడల కూలిపోయింది అని చెప్పాలి.
అయితే ఈ మ్యాచ్ లో ఓటమిపై సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సొంత గడ్డపై భారత జట్టు కఠిన ప్రత్యర్థి అన్న విషయం మాకు ముందే తెలుసు. ఇక మా ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యామ్ అంటూ చెప్పుకొచ్చాడు బావుమా. చేజింగ్లో మేము మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. తొలుత పవర్ ప్లే లో భారత్ ఎంతో దూకుడుగా ఆడింది. విరాట్ కోహ్లీ మెరుగ్గా రాణించాడు దురదృష్టవశాత్తు మేం బ్యాటింగ్ మెరుగ్గా చేయలేకపోయాం అంటూ చెప్పుకొచ్చాడు. సెమీఫైనల్ లో ఇదే వేదికపై ఆడే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగా సిద్ధమవుతాం అంటూ బావుమా తెలిపాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి