నేటి రోజుల్లో ప్రయోజకులై ఉన్నత స్థానంలో ఉన్న ఎంతోమంది ఒకప్పుడు వీధి బడుల్లో చదువుకొని ఈ స్థాయికి చేరుకున్నవారే. ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ చదువుతూ ఉన్నత స్థానానికి చేరుకున్నవారే. కానీ నేటి రోజుల్లో మాత్రం గవర్నమెంట్ స్కూళ్లు రోజురోజుకు కనుమరుగవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల కంటే ఇక ప్రైవేట్ స్కూళ్లకు పంపితేనే తమ పిల్లలు ప్రయోజకులు  అవుతారని తల్లిదండ్రులు అందరు కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారు.


 దీంతో ఎంత ఖర్చయినా పరవాలేదు. ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తామని అందరూ అనుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. కొంతమంది అయితే ఇక ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న  పిల్లల భవిష్యత్తు కోసం ఇక స్తోమతకు మించి ఖర్చు చేసి ప్రైవేట్ స్కూల్ కి తమ పిల్లలను పంపిస్తూ ఉండటం కూడా చూస్తూ ఉన్నామ్. ఇక ఇదే అదునుగ భావిస్తున్న ఎన్నో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న ఘటనలు కూడా రోజురోజుకు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వసూలు చేస్తున్న ఫీజుల గురించి తెలిసి ముక్కున వేలేసుకోవడం ప్రతి ఒక్కరి వంతు అవుతుంది.



 ఇక ఇప్పుడు ఇలాంటి ఒక ప్రైవేట్ స్కూల్ ఎంత ఫీజు వసూలు చేస్తుందో తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. పిల్లల్ని కిండర్ గార్డెన్ అదేనండి కేజీ చదివించాలంటే సాధారణంగా ఎంత ఖర్చవుతుంది. మహా అయితే ఏడాదికి 20వేల నుంచి 30 వేల వరకు ఉండొచ్చు. అంతే కదా కానీ ఒక పాఠశాలలో మాత్రం ఏకంగా అక్షరాల 2,72,718 రూపాయలు కట్టాలి. అది కూడా కేవలం కేజీ విద్య కోసమే. అందులో 33,000 తర్వాత రిఫండ్ ఇస్తారట. ఇలా ఒక ప్రైవేట్ స్కూలుకు సంబంధించిన ఫీజు ఎంత ఉంది అన్నదానికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారిపోయింది. యూకేజీ ఫీజు ఇంత వసూలు చేయడం ఏంటీ.. ఇక ఇద్దరు పిల్లలను చదవాలంటే తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటూ నేటిజన్స్ దీనిపై కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: