2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ఛాంపియన్ టీమ్  ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం సంచలనం నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఆ జట్టుకు ఐదు సార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తప్పించింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాను ఇక తమ టీం లోకి తీసుకొని మరి.. అతను చేతిలో సారధ్య బాధ్యతలను పెట్టింది జట్టు యాజమాన్యం. అయితే ఇక ముంబై ఇండియన్స్ యాజమాన్యం నిర్ణయం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే.



 ఐదు టైటిల్స్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మకు కనీస గౌరవం ఇవ్వలేదు అంటూ అందరూ తిట్టిపోశారు. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమైన తర్వాత హార్థిక్ పాండ్యా తన కెప్టెన్సీ తో రోహిత్ ను మరిపించగలడా అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో కూడా హార్దిక్ కెప్టెన్సీ లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది అని చెప్పాలి. గెలిచే మ్యాచ్లలో కూడా జట్టు ఓడిపోతూ ఉండడంతో.. హార్దిక్ కెప్టెన్సీఫై జట్టు అభిమానులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం కూడా అటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై వేటు వేసేందుకు రెడీ అయింది అని సమాచారం. అతని కెప్టెన్సీ లో వరుసగా రెండు ఓటములు చవిచూడటంతో.. ఇక ఫ్రాంచైజీ  హార్దిక్ కెప్టెన్సీ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. జట్టు ఓటములకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ నే కారణమని యాజమాన్యం భావిస్తున్నట్లు టాక్ ఉంది. ఈ క్రమంలోనే అతని కెప్టెన్సీ పై వేటువేసి జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న బుమ్రాకు సారధ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. దీనిపై తీవ్ర ఆలోచన చేస్తుందట ఫ్రాంచైజీ. ఇక త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది అని సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: