ప్రస్తుతం ఇండియాలో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. అయితే అంచనాలకు మించి ప్రేక్షకులను ఉత్కంఠతో మునివేలపై నిలబెడుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి మ్యాచ్ కూడా చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతూ ఎవరు విజేతగా నిలుస్తారు అన్న విషయం ముందుగా ఊహించలేని విధంగా మారిపోయింది. విశ్లేషకులు సైతం ఈ ఉత్కంఠను ఎంజాయ్ చేస్తూ క్రికెట్ మజాను పొందుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఈసారి బాగా రాణిస్తాయి అనుకున్న కొన్ని టీమ్స్ నిరాశ పరుస్తూ ఉంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కొన్ని టీమ్స్ మాత్రం అదరగొడుతూ  ఉన్నాయి.



 అయితే ఇటీవల రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక క్రేజీ మ్యాచ్ కి సమయం ఆసన్నమైంది. ముంబై ఇండియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ రెండు టీమ్స్ కి కూడా గతంలో కెప్టెన్స్ గా రోహిత్, కోహ్లీలు ఉండే వారు. అందుకే ఈ రెండు టీమ్స్ ఎప్పుడు పోటీ పడ్డ కూడా ఉత్కంఠ ఉండేది. అయితే ఇప్పుడు ఈ రెండు జట్లకి కెప్టెన్లు మారినప్పటికీ  కోహ్లీ రోహిత్ లు ఈ టీమ్స్ లో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతూ ఉండడంతో రెండు జట్ల మధ్య మ్యాచ్ కి ఎక్కడ క్రేజ్ తగ్గలేదు  


 మరోవైపు బెంగళూరు, ముంబై జట్లు ఈ ఏడాది ఐపిఎల్ సీజన్లో చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో నేడు ఈ రెండు టీమ్స్ మధ్య జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ముంబై హోం గ్రౌండ్ గా పిలుచుకునే వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్ని చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్లో తలబడక ముంబై 18 మ్యాచ్ లలో.. ఆర్సిబి 14 మ్యాచ్ లలో విజయం సాధించింది. ప్రస్తుత సీజన్లో మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తుంది. ఈ రెండు టీమ్స్ ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించాయి. మరి నేటి పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl