ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి గత కొంతకాలం నుంచి ఒక వార్త వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అర్ధాంతరంగా  తనను కెప్టెన్సీ నుంచి తప్పించిన  కారణంగా జట్టు యాజమాన్యంపై రోహిత్ శర్మ అసంతృప్తితో ఉన్నాడని.. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది  జరగబోయే ఐపీఎల్ లో మెగా వేలంలో అతను ముంబైని వదిలి ఇక వేలంలో పాల్గొంటాడు అన్న వార్త వైరల్ గా మారింది. అయితే ఒకవేళ రోహిత్ శర్మ లాంటి ఆటగాడు వేలంలోకి వస్తే అతని దక్కించుకునేందుకు అన్ని ఫ్రాంచైజీలు కూడా తెగ పోటీపడే అవకాశం ఉందని అటు క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.


 ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ జట్టు ఓనర్ గా కొనసాగుతున్న బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతి జింట రోహిత్ శర్మ గురించి గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసినట్టు ఒక వార్త వైరల్ గా మారిపోయింది. రోహిత్ గనుక వేలంలోకి వస్తే అతని దక్కించుకునేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకడుగు వేయను. మాకు టైటిల్ అందించే కెప్టెన్ కావాలి. అలాంటి ఆటగాడు రోహిత్ ఒక్కడే అంటూ ప్రీతిజింట వ్యాఖ్యలు చేసింది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఇది నిజమే అయ్యుంటుంది అని అందరూ నమ్మేశారు కూడా   అయితే ఈ విషయంపై ఇటీవల క్లారిటీ ఇచ్చింది ఈ బాలీవుడ్ హీరోయిన్. రోహిత్ శర్మను ఎంత ఖర్చు చేసి అయినా సరే పంజాబ్ టీం కెప్టెన్ గా కొనసాగిస్తానని తాను చెప్పినట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా ఫేక్ అంటూ ఆ జట్టు ఓనర్ ప్రీతిజింటా స్పష్టం చేసింది. నేను రోహిత్ కి బిగ్ ఫ్యాన్. అతన్ని చాలా గౌరవిస్తాను  కానీ అతని గురించి నేను ఏ ఇంటర్వ్యూలో మాట్లాడలేదు. మా జట్టు కెప్టెన్ ధవన్ అంటే నాకు ఎంతో గౌరవం. ప్రస్తుతం మా టీం బాగుంది. ఇక మా దృష్టి అంత టైటిల్ గెలవడం పైనే ఉంది అంటూ ప్రీతి జింటా ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: