సూర్య కుమార్ యాదవ్.. ఈ పేరు చెప్తే జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారు.  మరి ముఖ్యంగా క్రికెట్ అభిమానులకైతే ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సూర్యకుమార్ యాదవ్ ని లైక్ చేసి ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు . టీం ఇండియా క్రికెట్ సూర్య కుమార్ యాదవ్ కి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . బాగా వైరల్ గా మారింది ఆ. యన హాస్పిటల్ బెడ్ పై పడుకొని ఉండడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.


సూర్య కుమార్ యాదవ్ కి ఏమైంది..? ఎందుకు హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు..? అసలు ఆయన  హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..?? అని రకరకాలుగా మాట్లాడుతున్నారు . ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ హెల్త్ కి సంబంధించిన విషయం బయటకు వచ్చింది . సూర్య కుమార్ యాదవ్ కి పొత్తికడుపు కుడి దిగువ భాగంలో స్పోర్ట్స్ హెర్నియాకు జపాన్ లో సర్జరీ జరిగింది.  ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ అయింది . ఇదే విషయాన్ని తెలియజేశాడు సూర్య కుమార్ యాదవ్ .



"నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను.. వీలైనంత త్వరగా కోలుకుంటాను.. స్టేడియంలోకి రావడానికి ప్రయత్నిస్తాను " అంటూ సూర్య కుమార్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.  ఈ ఫోటోని చూడగానే  కొంతమంది  ఫస్ట్ టెన్షన్ పడిపోయారు. సూర్య కుమార్ యాదవ్ కి ఏమైందో ..? ఏమో..? అంటూ భయపడిపోయారు . ఆ తర్వాత అంత హెల్త్ బాగుంది అని క్లారిటీ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు.  సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు టీ20 కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం అందరికి తెలిసిందే. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత బీసీసీఐ సూర్యకు టీ20 సారథ్య బాధ్యతలు అప్పగించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: