ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన క్రికెట్ జట్లలో ఇంగ్లాండ్ ఒకటి. ఎన్నో సంవత్సరాల పాటు ఇంగ్లాండ్ జట్టు ఎన్నో అద్భుతమైన మ్యాచ్లను గెలిచి అన్ని ఫార్మేట్ లలో గొప్ప గుర్తింపును సంపాదించుకుంది. ఇలా క్రికెట్ ఆటలో గొప్ప స్థాయికి ఎదిగిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం వన్డేల విషయంలో మాత్రం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ప్రస్తుతం ఈ జట్టు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే 2027 వ సంవత్సరం జరిగే వన్డే వరల్డ్ కప్ లో అవకాశాన్ని దక్కించుకునే పరిస్థితులు కూడా చాలా తక్కువ శాతం కనబడుతున్నాయి. 2019 వ సంవత్సరం వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచిన ఇంగ్లాండ్ జట్టు ఆ సంవత్సరం వరల్డ్ కప్ ను దక్కించుకుంది.

ఇక 2019 వ సంవత్సరం వరల్డ్ కప్ ను దక్కించుకొని 2023 వ సంవత్సరం వరల్డ్ కప్ లోకి ఇంగ్లాండ్ జట్టు భారీ అంచనాల నడుమ అడుగు పెట్టింది. కానీ 2023 వ సంవత్సరం వరల్డ్ కప్ టోర్నీలో ఈ జట్టు అత్యంత పేలవమైన ప్రదర్శనను కనబరిచింది. 2023 ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు లీగ్స్ దశ నుండే వెనుదిరిగింది. ప్రస్తుతం ఈ జట్టు పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రస్తుతం ఈ జట్టు ఐసిసి ర్యాంకింగ్ల ప్రకారం 8 వ స్థానంలో కొనసాగుతుంది. 2027 ప్రపంచ కప్ కి దక్షిణాఫ్రికా , జింబాబ్వే ఆతిథ్య దేశాలు. దానితో ఈ రెండు జట్లు ఆటోమేటిక్ గా వరల్డ్ కప్ 2027 లో చోటు దక్కించుకుంటాయి.

ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ 8 వ స్థానంలో ఉన్నా కూడా దక్షిణాఫ్రికా , జింబాబ్వే నేరుగా వరల్డ్ కప్ 2027 లో అవకాశం దక్కించుకోనుండడంతో  ఇంగ్లాండ్ 9 వ స్థానం లోకి చేరుతుంది. దానితో ఇంగ్లాండ్ జట్టుకు నేరుగా వరల్డ్ కప్ 2027 లో అవకాశం దక్కదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంగ్లండ్ జట్టు 2027 ప్రపంచ కప్‌ లో చోటు కోసం క్వాలిఫయర్స్ మ్యాచ్ లను ఆడాల్సి వస్తుంది. మరి ఇంగ్లాండ్ జట్టు రాబోయే రోజుల్లో వన్డే మ్యాచ్లలో మంచి పాట తీరని కనబరిచి ర్యాంకింగ్ ను మెరుగుపరుచుకుంటుందా ..? లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: