ఈ సీరియల్ లో నటిస్తూ ఆమె తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేరళ నటి అయిన ఈమె పూర్తిపేరు ప్రేమి విశ్వనాథ్. ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు వంటలక్క కోసమే ఈ సీరియల్ ని చూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తీకదీపం సీరియల్ లో ఎంతో వినయంగా, పద్ధతి గా ఉంటూ అందరినీ ఆకర్షించిన వంటలక్క సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది. షూటింగ్ ఫోటోలను, షూటింగ్ విరామ సమయంలో వంటలు చేస్తూ ఉండే వీడియోలను, ఫన్నీ వీడియోస్ ను, స్నేహితులతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ప్రేక్షకులకు ఎంతో దగ్గరవుతుంది.
తాజాగా దమ్ము కొడుతున్న ఓ వీడియోను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. అదేంటి వచ్చే పొగతో వంట చేసే వంటలక్క పొగ తాగుతుంది అని అనుకుంటున్నారా.. అవును నిజంగానే వంటలక్క సిగరెట్ తాగుతుంది. ఈ వీడియోని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకోగా ఆవిడ ఇప్పుడు వైరల్ అవుతుంది . ఎర్ర చీర కట్టుకుని పసుపు చొక్కా వేసుకొని o చేత్తో కోడిని పట్టుకొని మరో చేత్తో కత్తి పట్టుకుని కనిపించడమే కాకుండా నోట్లో సిగరెట్ పెట్టుకుని పొగ వదులుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి