ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ఎన్నో సీరియల్స్ ప్రేక్షకాదరణ బాగా పొందుతున్నాయి అని చెప్పవచ్చు. ఇలాంటి ఎన్నో సీరియల్స్ లో చెప్పుకోదగిన సీరియల్స్ కూడా చాలానే వున్నాయి. ఈ సీరియల్స్ ఇటీవల టీఆర్పి రేటింగ్ లో దూసుకుపోతూ ప్రేక్షకులలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ కోయిలమ్మ.. ఈ నాటిక ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఇందులో నటించే నటీనటులు కూడా చాలా అందంగా ఉండడమే కాకుండా వారి నటన తో ఆడియన్స్ ని బాగా అలరిస్తున్నారు.. కోయిలమ్మ సీరియల్ లో నటిస్తున్న శకుంతల కూడా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.


మొదట గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఆ తర్వాత కోయిలమ్మ సీరియల్ లో అవకాశం దక్కించుకొని , మరింత చేరువ కావడానికి ప్రయత్నం చేస్తోంది. ఇక అసలు పేరు కావ్య శ్రీ.. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో డిసెంబర్ 13వ తేదీన జన్మించింది.. విద్యాభ్యాసం విషయానికొస్తే , బీఎస్సీ పూర్తి చేసిన కావ్య.. ఆ తర్వాత సినిమా లోకి వెళ్లాలని ఆలోచించింది. కావ్య తండ్రి పేరు నటరాజ్.. బోర్ వెల్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు.. ఇక తల్లి పేరు భాగ్య.. ఈమె  ఇంటి పనులు చూసుకుంటూ కూతుర్ల చదువు , ఇతర విషయాలను చూసుకుంటూ ఉంటుంది.

ఒక చెల్లెలు కూడా ఉంది.. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టపడే కావ్య, ఒక పక్క చదువుకుంటూనే మరోపక్క డాన్స్ కూడా నేర్చుకుంది.. నిజానికి కావ్యకు స్టడీస్ పైన ఎక్కువ ఆసక్తి ఉంది.. కానీ తన తల్లి కోరిక మేరకు ఆమె నటన వైపు అడుగులు వేయడం జరిగింది.. అలా  మొదటిసారి కన్నడ టెలివిజన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.. అక్కడ మహాకాళి, నాయకి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత బుల్లితెరపై గోరింటాకు సీరియల్ లో ప్రవేశం చేసింది.. వల్లి కారెక్టర్ లో బాగా మంచి పేరు తెచ్చుకున్న ఈమె,  ప్రస్తుతం కోయిలమ్మ సీరియల్ లో శకుంతలగా  ఒక అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్ నటిస్తూ ఆదరణ పొందుతోంది.మరింత సమాచారం తెలుసుకోండి: