
అయితే ఏమైందని అభిమానులు ఆర తీయగా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో మేఘసందేశం సీరియల్ కు సంబంధించి రీసెంట్ ఎపిసోడ్ ని షేర్ చేస్తూ ఈ ప్రోమోలో సౌమ్య పాత్ర మెట్ల మీద నుంచి జారి పడిపోయినట్లుగా చూపించడం జరిగింది . ఈ ప్రోమోని షేర్ చేస్తూ షూటింగ్లో అక్కడ నిజంగానే జారిపడ్డానని అయితే అదృష్టం బాగుండి ఎలాంటి దెబ్బలు పెద్దగా తగలలేదని తెలియజేసింది. అలాగే ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఎవరు కూడా చెప్పలేమంటూ రాసుకుంది సౌమ్య. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు సీరియల్ ఆడియన్స్ సైతం ఇలాంటి సన్నివేశాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి అంటు సలహాలు ఇస్తున్నారు.
మెట్ల మీద నుంచి సన్నివేశం చేస్తున్నప్పుడు సీరియల్ లో జారిపడినట్టుగా యాక్టింగ్ చేయబోయి నిజంగానే జారిపడిపోయింది సౌమ్య. అయితే అలా పడడంతో చిన్న చిన్న గాయాలయ్యాయని ఆమె షేర్ చేసిన ఫోటోలను కనిపిస్తోంది. నేటిజన్స్ ,అభిమానులు త్వరగా సౌమ్య కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. సౌమ్య జారిపడ్డటువంటి సీరియల్ కి సంబంధించి తాజా ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. అయితే అదృష్టవశాత్తు బయటపడ్డాను అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది వారణాసి సౌమ్య. మరి ఇక మీదట నైనా ఇలాంటి సన్నివేశాలు చేసేటప్పుడు జాగ్రత్త పడాలని అభిమానులు కోరుకుంటున్నారు.