మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు తమ మార్కెట్ పెంచుకోవడానికి అనునిత్యం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అధునాతన ఫీచర్లతో కొంగొత్త ఫోన్లను విపణిలో ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా చైనా మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్.. 9 సిరీస్ పేరిట మరో ఫోన్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 23న విపణిలోకి రానున్న ఈ ఫోన్‌లో మిగతా వాటికంటే అదిరిపోయే ఫీచర్లతో పాటుగా కెమెరా కూడా ఇందులో ఉంటుంది.
వన్‌ప్లస్ 9 ప్రో ప్రధాన కెమెరాలో సోనీ ఐఎంఎక్స్ 89 సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాలో సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్‌ను తీసుకొస్తున్నట్లు ఇంతకుముందే వెల్లడించింది. వన్‌ప్లస్ 9ప్రో ఫోన్‌కు సంబంధించిన టీజర్ లీకైంది.వన్‌ప్లస్ 9 ప్రో వేరియంట్ ఆస్ట్రల్ బ్లాక్, మార్నింగ్ మిస్ట్, పైన్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుందని వస్తుందని తెలుస్తుంది. రాబోయే వన్‌ప్లస్ 9 సిరీస్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 875 చిప్, 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని సమాచారం... గతంలో వచ్చిన పోలిస్తే ఈ ఫోన్ యువతను తప్పకుండా ఆకట్టుకుంటుందని అంటున్నారు.ఈ ఫోన్ మరి ఎంత క్రేజ్ ను అందుకుంటుంది అనేది యువతలో ఆసక్తిని కనబరుస్తుంది. మార్కెట్ లో సేల్స్ ఎలా ఉంటాయో అనేది ఆసక్తి గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి