ఇక అంతేగాక మీడియాటెక్ 8183 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. ఇందులో వచ్చేసి క్రోమ్ఓఎస్ ఉంటుంది. లెనోవో క్రోమ్‌బుక్ కు పోటీగా ఈ కంపెనీ ఆసుస్ క్రోమ్‌బుక్‌ను తీసుకొచ్చింది. దీని స్పెసిఫికేషన్లు కూడా అందులో ఉన్న స్పెసిఫికేషన్లలానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ మోడల్ కేవలం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ల్యాప్‌టాప్, టచ్ ట్యాబ్లెట్ లాగా మల్టీ టాస్క్ తో కూడా చాలా చక్కగా పని చేస్తుంది.ఇందులో 27Whr బ్యాటరీని తీసుకొచ్చారు. 45వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లుగానూ, బరువు 510 గ్రాములుగానూ ఉంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 349.99 డాలర్లుగా అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 25,500/- ఉంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.369.99 డాలర్లుగా అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా 27000/- గా ఉంది. ఇక కలర్ విషయానికి వస్తే మినరల్ గ్రే కలర్ లో లభిస్తుంది.. ఆ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి