మారుతున్న టెక్నాలజీ కి తగినట్లుగా సోషల్ మీడియాను ఏలుతున్న కొన్ని యాప్ ల యాజమాన్యాలు వినియోగదారులకు అనుకూలముగా కొన్ని ఫీచర్స్ ను యాడ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఒక సోషల్ మీడియా యాప్ కు సంబంధించి సెక్యూరిటీ ని మరింత బలోపేతం చేసినట్లు తెలుస్తోంది. మరి ఆ యాప్ ఏదో ? ఏ విధమైన భద్రతలో మార్పులు తీసుకు వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో పేస్ బుక్ కు ఎంతటి ఆదరణ ఉన్నదో మనకు తెలిసిందే. ఈ పేస్ బుక్ యాప్ నుండి మనకు వాట్సాప్ మరియు ఇంస్టా గ్రామ్ లాంటి మంచి మంచి యాప్ లు ఇందులో నుండి వచ్చినవే. ప్రస్తుతం ఎక్కువ మంది వాడుతూ మంచి ప్రాచుర్యంలో ఇంస్టా గ్రామ్ యాప్ ఉన్నది. ఇందులో ఇంస్టా గ్రామ్ ఒక మార్పును తీసుకు వచ్చి వారిని మరింతగా ఆకట్టుకుంటోంది.

ఇక మీదట ఇంస్టా గ్రామ్ వాడే యువకులకు ఈ మార్పుల ద్వారా మరింత సేఫ్టీ ఏర్పడుతుందని తెలిపింది. ఈ యాప్ వాడిన టీనెజర్స్ కు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఎటువంటి ఆటంకం ఉండబోదని తెలుస్తోంది. అయితే ఈ టెక్నాలజీ మన ఇండియాకు రావడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ముందుగా ఈ కొత్త మార్పులను అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు జపాన్ దేశాలలో మొదలు పెట్టనున్నట్లు సమాచారం.  ఒకవేళ చిన్న వయస్కులు అనగా 16 సంవత్సరాల లోపు వారు ఇంస్టా గ్రామ్ ఖాతాకు సైన్ అప్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ప్రైవేట్ ఖాతాగా మారిపోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇంస్టా గ్రామ్ వాడుతున్న టీనేజర్ల కోసం సెక్యూరిటీ సెట్టింగ్స్ ను మార్చడానికి మార్పులు చేయడం జరిగినదని వీరు తెలుపుతున్నారు. వీరు పబ్లిక్ అకౌంట్ నుండి కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా ప్రైవేట్ ఖాతాకు మారిపోవచ్చు.  

అంతే కాకుండా వినియోగదారుల వయస్సును తెలుసుకోవడానికి కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  దీని ద్వారా తక్కువ వయసున్న వారు వీడియో మరియు ఫోటోలను షేర్ చేయడానికి వీలు పడదు. మరియు తక్కువ వయసున్న వారి ఖాతాలను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వస్తారు. యాడ్స్ వేసే వారు కూడా ఇంతకు ముందులా కాకుండా వారి లింగం మరియు వయసు ఆధారంగా యూజర్స్ ను టార్గెట్ చేస్తారట. కేవలం 18 సంవత్సరాలు పూర్తయిన ఖాతాదారులకు మాత్రమే యాడ్స్ గురించి తెలిసేలా చేస్తామని తెలిపారు. ఇక ఇంస్టా గ్రామ్ యాప్ లో టెక్నాలజీస్ అన్నీ త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: