ఇక సోషల్ మీడియా టాప్ ఫ్లాట్ఫామ్ ఫేస్బుక్ సూపర్ న్యూస్ చెప్పడం జరిగింది. ఇక ఈ సంస్థ నుంచి రానున్న తర్వాతి హార్డ్వేర్ డివైజ్‌ను తాజాగా ప్రకటించడం జరిగింది.ఇక రేబాన్ స్మార్ట్గ్లాసెస్ను త్వరలో విడుదల చేయనున్నట్టు చెప్పడం జరిగింది. అయితే లాంచ్ డేట్ను మాత్రం ఫేస్బుక్ ఇంకా ప్రకటించలేదు. ఈ సంవత్సరం తప్పకుండా ఈ స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే కరోనా మహమ్మారి వల్ల చాలా సంస్థల ప్లాన్లు మారిపోయాయని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ చెప్పడం జరిగింది. అందువల్లే గ్లాసెస్ తీసుకొచ్చే సమయాన్ని కచ్చితంగా చెప్పలేకపోతున్నామనేలా వర్చువల్ సమావేశంలో తెలిపడం జరిగింది.ఇక గ్లాసెస్ మేకర్ ఎసిలోర్ లక్సోటికాతో భాగస్వామిగా మారి రేబన్ బ్రాండ్తో ఫేస్బుక్ ఈ స్మార్ట్గ్లాసెస్ను తీసుకొస్తోంది. ఇవి ఏఆర్ గ్లాసెస్ కాకపోయినా ఫీచర్లు మాత్రం చాలా అధికంగా ఉంటాయని టెక్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

“మా మొదటి స్మార్ట్గ్లాసెస్ను రేబాన్ నుంచి ఎసిలోర్ లక్సోటికా భాగస్వామ్యంతో తీసుకొస్తున్నాం.ఇక ఈ గ్లాసెస్లో చాలా ప్రత్యేకతలు ఉంటాయి.ఇంకా అలాగే స్పెషల్ సదుపాయాలు కూడా పొందవచ్చు” అని ఫేస్బుక్ సీఈవో జుకర్బర్గ్ చెప్పడం జరిగింది.ఇక ఫీచర్లు విషయానికి వస్తే .. ఎలాంటి ఫీచర్లు తీసుకొస్తున్నారని ఇంకా స్పష్టంగా చెప్పలేదు. అయితే ఈ గ్లాసెస్లో మాత్రం ఇంటిగ్రేటెడ్ డిస్ప్లే ఉండదని ఇది వరకే ప్రకటించిన ఫేస్బుక్.. ఇది మాత్రం రియాల్టీ డివైజ్ కాదని చెప్పకనే చెప్పింది. అయితే మాత్రం వాయిస్ కాల్స్ చేసేందుకు ఈ గ్లాసెస్ ఉపయోగపడతాయా లేదా వాయిస్ అసిస్టెంట్ యాక్సెస్ చేయవచ్చా అన్నది కూడా ఇంకా స్పష్టం అయితే కాలేదు. అయితే ఈ ఫీచర్లు ఉండే అవకాశం మాత్రం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ ఇంటిగ్రేడెట్ డిస్ప్లే లేని కారణంగా స్మార్ట్ఫోన్ యాప్స్ సాయంతోనే ఈ స్మార్ట్గ్లాసెస్ ఫుల్ ఫీచర్లు పని చేసే అవకాశం ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: