మయన్ల నాగరికతకూ... యుగాంతానికీ సంబంధం ఉందని చాలా మంది చెబుతుంటారు. ఈ ప్రపంచం ఎప్పుడు అంతిరించిపోతుందో  మయన్లు ముందే లెక్కలు వేశారని చాలా మంది చెబుతుంటారు. మధ్య అమెరికాలో ఈ మయన్ల నాగరికత విలసిల్లింది. అందుకు గుర్తుగా మయన్లు  మెక్సికోలోని యుకాటాన్‌లో ఓ భారీ పిరమిడ్ ను నిర్మించారు . ప్రపంచం నలుమూలల నుంచి  పిరమిడ్ ను చూడటం కోసం పర్యాటకులు వస్తుంటారు .. అక్కడికి పర్యాటకులు  వచ్చి ఆ పిరమిడ్‌ను చూస్తూ ఫోటోలను దిగుతూ ఉంటారు. ఫలితంగా మయన్ పిరమిడ్  ప్రాచీన ప్రపంచ వారసత్వ సంపద గా గుర్తింపు పొందింది. అలాంటి పిరమిడ్‌ని వీడియో తీస్తూ ఓ మహిళ  ఏకంగా మెట్లు ఎక్కేసింది. ఈ ఘటనతో అక్కడి ఉన్న పర్యాటకులు  ఆశ్చర్యానికి గురైయ్యారు . పర్యాటకుల ముందు మెట్లు ఎక్కడంతో అలాగే  చూస్తూ ఉండిపోయారు .. ఇక చేసేదేమి లేక వాళ్ళు తమ  ఫోన్లకి పని చెప్పారు ..   మహిళా మెట్లు  ఎక్కుతున్న దానిని వీడియోగా తీసి యూట్యూబ్ లో పెట్టారు ..  

అయితే  ఆమె పిరమిడ్ ఎక్కేశాక కళ్లు తెరిచిన అధికారులు... గట్టిగా అరుస్తూ ఆమెను వెనక్కి పిలిపించారు. ఈ పిరమిడ్‌ని ఎల్ కాస్టిల్లో అని పిలుస్తారు. దీని మెట్లకు పై భాగంలో 79 అడుగుల ఎత్తైన ఆలయం కూడా  ఉంది. దానితో కలిపి లెక్కిస్తే ఈ పిరమిడ్ ఎత్తు 98 అడుగులు. నిజానికి ఈ పిరమిడ్ మెట్లు చాలా ప్రమాదకరంగా నిలువుగా ఉంటాయి. ఓ దశలో ఆ మహిళ కూడా  ఎక్కలేక ఇబ్బంది పడుతున్న దృశ్యాన్ని మనం ఈ  వీడియో లో చూడవచ్చు

ఆమె ఇలా పిరమిడ్  ఎక్కడానికి గల కారణం .. ఆమె తన భర్త యొక్క చితాభస్మాన్ని ఈ పిరమిడ్ దగ్గర ఉంచడం కోసమే పిరమిడ్ ను ఎక్కానని అనంతరం ఆమె కిందకి దిగాక తెలిపింది ..ఆమె కోరుకున్న మొక్కు తీర్చేందుకు   అనుకోకుండా అందరు చూస్తుండగానే తొందరగా పిరమిడు ఎక్కింది .. అక్కడి నిబంధనల ప్రకారం పర్యాటకులెవరు ఆ పిరమిడ్ ను ఎక్కడానికి వీలులేదు. కావాలంటే అక్కడికి వచ్చినవారు  ఫొటోలు,  వీడియోలూ తీసుకోవచ్చు. పొరపాటున కూడా పిరమిడ్ ఎక్కే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడి అధికారులు చెబుతున్నారు .. ఇక ఆనుకోకుండా ఎక్కినా మహిళను అధికారులు జాగ్రత్తగా కిందకు దింపారు .. ప్రస్తుతం ఆ మహిళ పోలీసుల కస్టడీలో ఉంది...



మరింత సమాచారం తెలుసుకోండి: