దాదాపు గత ఏడాది కాలంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక ఇబ్బందులకు గురయ్యారు. మరీ క్కువగా పిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలు క్కువగా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ క్రమంలో కరోనా వైరస్ మమహ్మారి నిర్మూలనకి వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే.. అంతా ఆనందం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైన్ పూర్తి చేసుకుని, ఇక కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం చేశారు. అయితే వ్యాక్సిన్ విషయంలో మాత్రం అనేక భయాలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ వేయించుకున్నవారు మృతి చెందుతున్నారనే క్రమంలో వ్యాక్సిన్ ఎంతవరకు కరెక్ట్ అని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోవాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో వ్యాక్సిన్ వేయించుకున్న ఐదుగురు డాక్టర్లు మహమ్మారి బారిన పడటంతో కలకలం రేగింది.




కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన ఐదుగురు డాక్టర్లు కరోనా టీకాను తీసుకున్నారు. తరువాత మహమ్మారి బారిన పడటంతో తీవ్ర సంచలన రేగింది. తొలి డోస్ తీసుకున్న వారం వ్యవధిలోనే కరోనా సోకింది. ఈ డాక్టర్లు 40నుంచి 50 ఏళ్ల వారు కావటం గమనించాల్సిన విషయం. దీంతో వ్యాక్సిన్ పనితీరుపై వైద్య సిబ్బంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారం వ్యవధిలో కరోనా సోకినంత మాత్రాన టీకా పనితీరు బాగాలేదని భావించనక్కర్లేదని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. టీకా తీసుకున్న తరువాత దాదాపు 40 రోజులకు శరీరంలో యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయని అంటున్నారు. తొలి డోస్ తీసుకున్న 28 రోజుల తరువాత రెండో డోస్ ను ఇస్తారనే విషయం తెలిసిందే. రెండో డోస్ తీసుకున్న పది రోజులకు శరీరంలో యాంటీ బాడీలు పెరుగుతాయన్నారు. అప్పుడే కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తి శరీరానికి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే కరోనా టీకా తీసుకున్న వారు కూడా అన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు చెబుతూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: