పాములు, అనకొండలు ఎంత ప్రమాదకరమైన ప్రాణులో చెప్పనవసరం లేదు. వాటిని చూస్తేనే గుండె ఝల్లుమని భయంతో పరుగులు పెడతాం.అలా భయపడటం మానవుల సహజ లక్షణం. అయితే కొంత మంది అలాంటి విషపు సర్పాలతో గారడీలు చేస్తే.. మరి కొంతమంది వాటిని పెంపుడు జంతువులుగా ఇళ్లలోనే పెంచుకుంటూ ఉంటారు.ఇక మనదేశంలో అయితే ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయి గానీ.. విదేశాల్లో మాత్రం చాలా మంది పెంచుకుంటూ వుంటారు. ఇలా ఎంతోమంది జనాలు పైథాన్‌లను పెట్స్ కింద ఇంట్లోనే పెంచుకుంటారు. ఇక అదే పని ఇప్పుడు ఓ వ్యక్తి ప్రాణం మీదకు తీసుకొచ్చింది.ఇక మాములుగా పాము మన ఇంటి పరిధిలో కనిపిస్తే చాలు.. మనకు రాత్రి పూట అసలు నిద్ర అనేదే పట్టదు. అలాంటిది ఓ భయంకరమైన పైథాన్ సడన్ గా టాయిలెట్‌లో ప్రత్యక్షమైతే.. ఇంకేమైనా వుంటుందా.! మన ప్రాణం ఇక అంతే.. పై నుంచే పైకి పోతుంది.

తాజాగా ఇలాంటి సంఘటనే ఆస్ట్రియాలో చోటు చేసుకుందట. తన ఇంట్లో టాయిలెట్‌లో కూర్చున్న ఓ వ్యక్తిని పైథాన్ దాడి చేసింది. అది కూడా తన ప్రైవేట్ పార్ట్‌పై అది కరిచింది. ఇక ఆ వివరాలు చూసినట్లయితే ఇలా ఉన్నాయి.ఇక 65 సంవత్సరాల వయసున్న వ్యక్తి తెల్లవారుజామున టాయిలెట్‌ కి వెళ్లాడు.ఇక అతను యధాలాపంగా టాయిలెట్ సీటుపై కూర్చోగానే ఎక్కడో అలికిడి అవుతున్నట్లుగా శబ్దం వినపడింది.ఏదో కొత్తగా ఉన్నట్లు ఆ వ్యక్తికి అనిపించిందట. ఇక ఏంటా.! అని చూస్తే అతడి ఫ్యూజులు దెబ్బకి ఎగిరిపోయాయి. సరిగ్గా అతను కూర్చున్న చోటే ఒక పైథాన్ తిష్ట వేసుకుని ఉంది.ఇక ఆ గగుర్పొడిచే దృశ్యాన్ని చూసి షాక్ అయిన అతడు కాస్త తేరుకుని బయటపడేలోగానే అక్కడ జరగాల్సినదంత జరిగిపోయింది. ఆ పైథాన్ అతడి ప్రైవేటు పార్ట్‌ మర్మాంగం పైనే కరిచేసింది.ఇక ఈ ఘటనకి సంబంధించిన సమాచారాన్ని అక్కడి పోలీసులు అందుకుని వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఇక ప్రస్తుతం అతడి పరిస్థితి కొంచెం బాగానే ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: