
ఈ వీడియోలో హర్షద్ గోతాంకర్ అనే వ్యక్తి రెండు చేతులు కోల్పోయి ఉన్నాడు. అయినా సరే తన రెండు పాదాలతో తన స్నేహితులతో చెస్ ఆడుతున్నాడు. దీనిని బట్టి ఒక మనిషి అంగ వైకల్యం కలిగిన వారైనా దైర్యంగా, నమ్మకంతో ఏదైనా సాధించలగరు అని చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణగా నిలిచింది. మన సంకల్పం ముందు అంగవైకల్యం ఏమీ చేయలేదు అని ప్రపంచానికి చాటి చెప్పాడు. మనము సాధించగలం అనుకుంటే ఏదైనా ఎలాగైనా సాధించగలం. ఈ వీడియో ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అసాధ్యం కానిదైనా సుసాధ్యం చేసి చూపగలం అని సచిన్ ఈ పోస్ట్ లో రాసుకొచ్చాడు. హర్షద్ నుండి మనమంతా ఎంతో నేర్చుకోవాలని తెలపడం విశేషం.
ఈ వీడియో వీక్షకులందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 86000 మంది చూడగా, 12000 మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోకు అనుసంధానంగా వారికి నచ్చిన విధంగా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. జీవితంలో ఎదగాలి అని బలంగా నమ్మిన వారికి ఏ ఇబ్బందులు అడ్డు కాదు అని మనము తెలుసుకోవాలి.