ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది. మాములుగా మనము సినిమాలలో ఎక్కువగా ఇలాంటివి చూస్తుంటాము. వివరాల్లోకి వెళితే ఈ నెల 16 వ తేదీన గుజరాత్ కర్ణన్ తాలూకా దేహన్ గ్రామంలో 30 సంవత్సరాల వయసున్న మహిళపై ఒక గ్రూప్ కలిసి అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. ఈ విషయం ఆ రోజే సంబంధిత ఏరియాలో కేసు ఫైల్ అయింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు వడోదర లోని స్నిప్పర్ డాగ్ జావా సహాయంతో నేరం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. ఈ కుక్క సహాయంతో త్వరగానే ఆ గ్రూప్ లో ఒకరైన బహదూర్ గిర్దారం ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ సూపర్ డాగ్ నేరస్థులు ఉపయోగించిన బాటిల్ మరియు ఒక వస్త్రాన్ని వాసన బట్టి పారిపోయిన మిగిలిన నేరస్థులను దొరికేలా చేసింది.
దాదాపుగా రెండు కిలోమీటర్ల వరకు పోలీసులను ఆ కుక్క తీసుకెళ్లి కేవలం 20 నిముషాల వ్యవధిలోనే ఆ నేరస్థులను పట్టుకుంది. గుజరాత్ లో ఇలా కుక్క నేరస్థులను పట్టించడం ఈ 45 రోజుల్లోనే మూడవ సారి కావడం విశేషం. ఇది తెలిసిన నెటిజన్లు ఆ కుక్కను సూపర్ డాగ్ అంటూ కితాబిచ్చారు. ఇకనైనా మిగిలిపోయిన నేరస్థుల కేసుల విషయంలో కుక్కలను వాడండి అంటూ ప్రజలు పోలీసు లకు సలహాలిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి