అదృష్టం ఎప్పుడూ ఎవరి ఇంటి డోర్ కోడుతుందో చెప్పడం కాస్త కష్టం.. కానీ రావాల్సిన టైం లో మాత్రం అదృష్టం లక్క పట్టికున్నట్లు పట్టుకుంటుంది.. అయితే కొంచెం టైం పడుతుంది. ఎలాగైతె చావు పుట్టుకలు ఉంటాయో అదృష్టం, దురదృష్టం కూడా అలానే ఉంటాయి.. కోటేశ్వరుడు అన్నీ పోగొట్టుకొని రోడ్డున పడవచ్చు. ఏమి లేని వాడు ఒక్క రాత్రిలోనే మిలినియర్ అవ్వొచ్చు. ఎ పుట్టలో ఎ పాము ఉంటుందో చెప్పలేము. ఇప్పుడు జరిగిన ఓ ఘటన అలానే ఉంది. రోజు రెక్కాడితేగాని డొక్కాడని ఓ వ్యక్తికి సడెన్ గా కోట్లు వచ్చి పడ్డాయి.


విషయానికొస్తె అతను ఒక గొర్రెల కాపర్.. రోజు గొర్రెల ను మెపుతూ జీవనం సాగిస్తాడు. అయితే నిన్న గొర్రెలను రోజూ లాగే మెపుకొని రావడానికి వెళ్లాడు. అనంతరం గొర్రెలకు నీళ్ళు తాపడానికి నది దగ్గరకు వెళ్ళాడు. అక్కడ మెరుస్తూ ఓ రాయి కనిపించింది. దాన్ని అతను తీసుకొని ఇంటికి వచ్చాడు. అది చూడటానికి అచ్చం ఒక వజ్రాలు ఉన్నట్లు ఉంది. దాన్ని అతను తీసుకొని వచ్చాడు. అయితే అవి విలువైనవా కాదా అనేది ఆర్కియాలజీ అధికారులు తేల్చనున్నారు.

 

వివరాల్లొకి వెళితే.. కోనసీమ జిల్లా ఆత్రేయ పురం మండలం పేరవరం గ్రామానికి చెందిన రమేష్ గొర్రెల కాపరిగా కాలం వెళ్లదీస్తున్నాడు. రోజువారీ జీవితంలో భాగంగా మేతకు గొర్రెలను తోలుకెళ్లి.. మధ్య లో నీళ్లు తాగించేందుకు స్థానిక గోదావరి తీరానికి వెళ్లాడు. గోదావరి లో కళ్లు మిరిమిట్లు గొలిపేలా మెరుస్తూ ఒక తెల్లటి రాయి అతని కనిపించింది. రాయి మధ్య లో వజ్రాలు పొదిగినట్లు మెరుస్తూ ఉండడం తో ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే దాన్ని తెలిసిన వారికి చూపించాడు.వజ్రాలు అని చెప్పారట. దీంతో ప్రస్తుతం ఈ రాయిని ఇంట్లో భద్ర పరిచినట్లు తెలిపాడు.ఆర్కియాలజీ అధికారులు వస్తే గానీ అసలు విషయం తెలియదు..


మరింత సమాచారం తెలుసుకోండి: