సాధారణంగా ఎన్నో రకాల వృత్తులు ఉన్నప్పటికీ కూడా ఎంతో గొప్పదైనది మాత్రం ఉపాధ్యాయ వృత్తి అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే భావి భారత పౌరులను ఎంతో ప్రయోజకులుగా  తీర్చిదిద్దే అవకాశం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే దక్కుతూ ఉంటుంది. అంతే కాదు మిగతా వృత్తులతో పోల్చి చూస్తే అటు ఉపాధ్యాయ వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనది అని చెప్పాలి.. సాధారణంగా ఉపాధ్యాయులు తన వద్ద చదువుకుంటున్న పిల్లలను సొంత పిల్లల్లా భావిస్తూ ఇక విద్యాబుద్ధులు నేర్పి సరైన మార్గంలో నడిచేలా చూసుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతో మంది టీచర్లు బాధ్యతారాహితంగా వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఈ క్రమంలోనే చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించడం కాదు బాధ్యతగా వ్యవహరించాల్సిన ఉపాధ్యాయులే పెడదారి పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఏకంగా ఫుల్లుగా మద్యం తాగి ఇక పాఠశాలలు కళాశాలలకు వస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయ్. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఇలాంటి టీచర్లను నమ్మి మేము ఎలా మా పిల్లలను స్కూళ్లకు కళాశాలలకు పంపించగలం అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మరోసారి ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.


 ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ లో స్థానిక పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడు ఏకంగా మద్యం సేవించి హాజరయ్యాడు. అంతేకాదు తనతో పాటు మద్యం బాటిల్లను కూడా క్లాసులోకి తీసుకువెళ్లాడు అని చెప్పాలి. ఇక తరగతి గదిలో పిల్లల ముందే ఆ బాటిల్స్ పెట్టుకున్నాడు. అయితే ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు చేస్తున్నదంత గమనించి చివరికి స్కూల్లోకి వెళ్లి నిలదీస్తాడు. దీంతో ఇక అతని వద్ద ఉన్న మందు బాటిల్స్ ను దాచిపెట్టడానికి ప్రయత్నించాడు సదరు ఉపాధ్యాయుడు. ఇదంతా వీడియో తీసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో  వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: