ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించింది ఇంకా ఏది లేదు. నవ మాసాలు మోసి పిల్లలకు జన్మనివ్వడమే కాదు.. ఇక ఎప్పుడూ కంటికి రెప్పలా పిల్లలను కాచుకుంటూ ఉంటుంది. పిల్లలకు ఏ కష్టం వచ్చినా కూడా అపర కాలిలా మారిపోయి ధైర్యంగా ఆ కష్టాన్ని తరిమికొడుతుంది అని చెప్పాలి. అయితే కేవలం మనుషుల్లోనే కాదు జంతువులు పక్షుల్లో సైతం తల్లి ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు అన్నదానికి నిదర్శనంగా ఇప్పటివరకు ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా విషపూరితమైన పాములు సైతం తమ పిల్లల మీదకి వస్తే పక్షులు ఎదురుదాడికి దిగి పిల్లల ప్రాణాలను కాపాడుకుంటూ ఉంటాయి.


 ఇలా ఏకంగా పిల్లలను రక్షించేందుకు తల్లి ప్రేమ ఎంత దూరమైనా తీసుకువెళ్తుంది అన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో ఇందుకు నిదర్శనంగా మారింది అని చెప్పాలి. ఏకంగా ఈ వీడియోలో పక్షి పిల్లలతో ఆడుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అక్కడే కాసేపటి వరకు సదరు వ్యక్తిని కోపంగా చూస్తూ ఉండిపోయిన తల్లి పక్షి ఒక్కసారిగా అతనిపై దాడి చేయడం మొదలుపెట్టింది.  పక్షి తన పిల్లలతో ఎంతో జాగ్రత్తగా రోడ్డు దాటుతున్న సమయంలో దానిని చూసిన ఒక వ్యక్తి వీడియో తీసి ఇక ఆ చిన్న పక్షిపిల్లలను చేతిలోకి తీసుకున్నాడు.


దీంతో తన పిల్లలకు ఏం హాని తలపెడుతున్నాడో అని భయపడిపోయిన తల్లి పక్షి.. ఏకంగా అతనిపై దాడి చేసింది. అతను ఏకంగా తప్పించుకునేందుకు పరుగులు పెడుతున్నా కూడా వదలకుండా అతన్ని వెంబడించి మరి ముక్కుతో పొడవడం మొదలుపెట్టింది అని చెప్పాలి.  అయితే ఇక అక్కడ జరుగుతున్నదంతా ఒక యువతి వీడియో తీసి తెగ నవ్వుకుంది. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇక ఇది చూసిన నెట్టుజన్స్ సైతం నవ్వుకుంటున్నారు. తల్లి ప్రేమకు ఏదీ సాటి రాదు అన్నదానికి నిదర్శనంగా ఈ వీడియో మారిపోయిందని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: