విధి ఆడిన వింత నాటకం లో మనుషుల జీవితాలు కేవలం కీలు బొమ్మలు మాత్రమే అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే వెలుగు లోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇది నిజమే అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే అంతా సాఫీగా సాగి పోతుంది అనుకుంటున్నా సమయం లో ఊహించని ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వెలుగు లోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే.


 సాధారణం గా ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఇక మనిషి ఆరోగ్యం గా ఉండగలుగుతాడు అని వైద్యులు చెబుతూ ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఇక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు అని వైద్యులు సూచిస్తూ ఉంటారు. శారీరక దృఢత్వం తో పాటు మానసిక దృఢత్వం కూడా వస్తుందని అంటూ ఉంటారు. కానీ అదే వ్యాయామం ప్రాణాలు తీస్తుందా.. అంటే మాత్రం ఇటీవల కాలంలో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత అందరూ అవును అని చెబుతున్నారు. ఏకంగా ప్రతిరోజు వ్యాయామం చేస్తున్న వారు చూస్తూ చూస్తుండగానే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు.


  ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక కాలేజీ యువకుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. గాజియాబాద్ కు చెందిన సిద్ధార్థ్ కుమార్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. అయితే ఇటీవల రోజు లాగానే జిమ్ కు వెళ్లి వర్కౌట్ చేయడం మొదలుపెట్టాడు  అయితే సడన్గా గుండెపోటు రావడంతో ట్రెడ్ మిల్ పైన కుప్పకూలిపోయాడు  అయితే అదే జిమ్ లో ఉన్న మరొక ఇద్దరు వ్యక్తులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసిన అప్పటికే ప్రాణాలు పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: