2020లో దేశమంతట ఒక్కసారిగా కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం గురించి ఇప్పటికి ప్రజలు భయపడుతూ ఉంటారు. ఈ మాయ రోగం కారణంగా చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దేశం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని కూడా చూపించింది. అయితే వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఆ తర్వాత ఈ వ్యాక్సిన్ వల్ల గుండెపోటుతో మరణించే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయనే విధంగా అధికారులు కూడా తెలియజేస్తున్నారు.


ప్రస్తుతం దేశంలో 257 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేస్తోంది. ఈ కేసులు స్వల్ప తీవ్రతతో ఉంటున్నాయని పరిస్థితిని అదుపులో అయితే ప్రస్తుతం ఉంది. ప్రజలు ఎవరూ కూడా భయపడాల్సిన పనిలేదు అంటూ కేంద్రం అయితే తెలియజేస్తోంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా సింగపూర్, హాంకాంగ్ వంటి ప్రాంతాలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యామంటూ తెలియజేశారు. ఈనెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 164 కేసులు కొత్తగా వచ్చాయని తెలుపుతున్నారు.


ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలోని ఈ కేసులు ఎక్కువగా పెరుగుతున్నట్లుగా వెల్లడించారు. గత వారం రోజులలోనే కేరళలో  70 కేసులు నమోదయ్యాయని ,మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నవోదయాయని ఆరోగ్యశాఖ ప్రకటనలో తెలియజేసింది. NCDC అధికారులు తెలిపిన ప్రకారం ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ కింద కేంద్ర ప్రభుత్వం కూడా పలు రకాల ఆస్పత్రులను ఎంక్వయిరీ చేసి నిపుణులతో చర్చించిన తరువాతే ఈ ప్రకటన జారీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇండియాలో అయితే మెల్లమెల్లగా ఎంట్రీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్రజలు కూడా మరొకసారి అప్రమత్తంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ మాస్క్ తోనే బయటకి రావాలనే విధంగా ఆరోగ్యశాఖ తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: