నిన్న మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో జరిగిన విమాన ఘటన దేశం మొత్తాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది . గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్ప కూలిపోయింది.  ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ విమాన ప్రమాదంలో 241 మంది అక్కడికక్కడే మరణించారు.  ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు . వీరు ఈ విమానంలో ఉన్న వాళ్లయితే విమానం కూలిన బిల్డింగ్ లో మెడికల్ విద్యార్థులు కూడా కొంతమంది చనిపోయారు . మరి కొంతమంది తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిటాడుతున్నారు. 


242 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా అభిమానం కొన్ని సాంకేతిక లోపం కారణంగా టేకప్ అయిన 32 సెకండ్లలోని కుప్ప కూలిపోయింది.  ఈ విమానంలో 229 మంది ప్రయాణికులు ఇద్దరు పైలెట్లు పదిమంది విమాన సిబ్బంది ఉన్నారు . బాధాకరమేంటంటే విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.  మిగతా 241 మంది అక్కడికక్కడే కాలి బూడిద అయిపోయారు.  ఈ విషాద కర  దృశ్యాలు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి.



అయితే కేవలం ఒకే ఒక్కడు ప్రయాణికుడు ఎలా బయటపడ్డాడు..? అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది . దానికి కారణం ఆయన బుక్ చేసుకున్న 11 A సీట్ అంటున్నారు జనాలు. 11 A సీట్లో కూర్చున్న రమేష్ అదృష్టం బాగుంది బయటపడ్డాడు అని అది ప్రత్యేకత ల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే అసలు ఈ 11 A సీటు కి ఉన్న ప్రత్యేకత ఏమిటి ..?? అంటూ నెటిజన్స్  సెర్చ్ చేస్తున్నారు . ఆశ్చర్యపోయే విషయాలు కూడా తెలుసుకుంటున్నారు .



బోయింగ్ విమానంలో 11 A సీట్ చాలా చాలా స్పెషల్ . ఎయిర్ కండిషన్  సమీపంలో ఉంటుంది.  దీనివల్ల అక్కడ కిటికి ఉండదు. దీంతో ఈ సీటును సాధారణంగా ఎవరు ఎంచుకోరు . ఎందుకంటే విండో వ్యూ మిస్ అయిపోతారు అని . ముఖ్యంగా 10 గంటల పైన ప్రయాణం చేసే విదేశీ ప్రయాణికులు అయితే అసలు ఈ సీట్ ని బుక్ చేసుకోవడానికి ఇష్టపడరు . కొన్ని కొన్ని సార్లు తప్పని పరిస్థితులలో బుక్ చేసుకుంటారు. 11 A తీసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు . ఈ సీట్ బుక్ చేసుకోవడం ద్వారా ఎమర్జెన్సీ మార్గానికి దగ్గరగా ఉండడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడుచు అంటూ కొంతమంది జనాలు అభిప్రాయపడుతూ ఉంటారు . ఇప్పుడు అదే అభిప్రాయం రమేష్ విషయంలో నిజమైంది . ఇష్టం లేకుండానే బుక్ చేసుకున్న ఆ సీటు ఇప్పుడు ఆయన ప్రాణాలతో కాపాడింది. దీంతో అందరూ ఆయన లక్కీ పర్సన్ అంటున్నారు. అంతేకాదు ఈ 11A సీట్ తీసుకోవడానికి యూరప్ దేశాలల్లో కొన్ని జోకులు కూడా బాగా పెలుతూ ఉంటాయి. ఆ జోకే ఇప్పుడు ప్రాణాలను కాపాడింది అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు మొత్తానికి మృత్యుంజయుడుగా రమేష్ బయటపడటం ఆయన కుటుంబ సభ్యులకే కాదు యావత్ దేశానికి ఆనందం కలిగిస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: