
అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద శబ్దం రావడంతో ఇది ప్రయాణికులను కూడా భయాందోళనకు గురిచేసింది. గ్రీస్లోని కోర్పు దీపం మీదుగా వెళుతున్న విమానానికి సంబంధించి అక్కడ ఉండే స్థానికులు తమ మొబైల్ ఫోన్లో ఈ వీడియోలను రికార్డు చేశారు. ఆకాశంలో విమాననికి మంటలు చెలరేగిపోవడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. అయితే వెంటనే ఈ విషయం పైన అప్రమత్తమైన విమాన సిబ్బంది అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి మొదట ఇంజన్లోని మంటలను కూడా ఆర్పి వేయడానికి ప్రయత్నించారు.
కానీ మంటలు కొనసాగుతూ ఉండడంతో పరిస్థితి అర్థం చేసుకున్న పైలెట్లు.. కోర్ఫుకు తిరిగి వెళ్లే బదులుగా ఇటలీలో ఒక అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఇంజన్ తోనే సురక్షితంగా 8,000 అడుగుల ఎత్తు నుంచి బ్రిండిసి వైపుగా మళ్ళించారు. దీంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఫైలెట్లను అందరూ ప్రశంసిస్తున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత వెంటనే అక్కడ సిబ్బంది చేరుకొని ప్రయాణికులను క్షేమంగా కిందికి దించేశారు. ఈ ఘటనలో ఎవరికి కూడా ఇలాంటి ప్రమాదం జరగలేదని తెలిసి ఎయిర్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలాంటి అసౌకర్యానికి ప్రయాణికులకు క్షమాపణలు చెప్పి ఆ మరుసటి రోజు వారిని జర్మనీకి ప్రయాణించేందుకు అన్ని ఏర్పాట్లను విమాన సిబ్బంది చక చకా చేశారు.