కోవిడ్-19 మహమ్మారి 2020 మార్చి నుంచి మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇప్పుడు మనము క్యావాల్సినది అ అంతా ఒక్కటే...ఈ కరోనా వైరస్ బారినపడకుండా అప్రమత్తంగా ఉండటం మరియు కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకోవడం. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి మరియు మిమ్మల్ని మరియు ఇతరులను సంరక్షించుకోవడంలో సహాయపడటానికి మీరు తీసుకోగల సులభమైన కొన్ని పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ కరోనా వైరస్అ అంటు వ్యాధి కావడం మన దురదృష్టం. ఇది ముఖ్యంగా మన ముక్కులో నుండి వచ్చే రేణువుల ద్వారా మరియు మనము దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మనిషి నుండి మనిషికి అత్యంత సాధారణంగా వ్యాప్తి చెందుతుంది. ఒకరిని ఒకరు కరచాలనం చేయడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి