జీవితంలో ఎదగడానికి మనకంటూ ఒక లక్ష్యం అవసరం. పలానా గమ్యం అని లేకపోతే దిశ లేని గాలిపటంలా మన జీవితం కూడా ఎలా పడితే అలా చెల్లా చెదురుగా తిరుగుతుంది. గమ్యం ఉన్నప్పుడే మన జీవితానికి ఓ అర్దం ఉంటుంది. లక్ష్యం నిర్ణయించుకుంటే ఆ లక్ష్యం కోసం మన పయనం మొదలవుతుంది, అనుకున్నది సాధించాలనే తపన మనలో పెరుగుతుంది. కష్టమైనా నష్టమైనా పట్టుదలతో ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుంది. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం లభిస్తుంది. అనుకున్నది సాదిస్తే వచ్చేది కేవలం సంతోషం మాత్రమే కాదు. కీర్తి ప్రతిష్టలతో కూడిన మంచి గుర్తింపు లభిస్తుంది. కసితో అనుకున్నది సాధించి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాము.

నలుగురు మనల్ని గౌరవిస్తారు ఆదరిస్తారు.  మీ అంకిత భావం, కృషి,  ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని మీ లక్ష్యానికి చేరువ చేస్తుంది. మీ ఫోకస్ ఎదురయ్యే ప్రతి సవాల్ ని అధిగమించేలా చేస్తుంది. లక్ష్యం ఎప్పుడు మరి అసాధ్యమైనది గా ఉండకూడదు. మన సామర్థ్యానికి అనుగుణంగా లక్ష్యం ఎంపిక ఉండటం ఉత్తమం. మన మనస్సును కేంద్రీకరించడం వలన లక్ష్యాన్ని చేరుకోవడం మరింత సులభతరం అవుతుంది.  మన కోరికే మన లక్ష్యం, అయితే లక్ష్యాలను ఒక పద్ధతిలో ఏర్పరుచుకోవాలి. ఆ లక్ష్యానికి నిర్దిష్టమైన ప్రణాళికను రచించాలి. ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతూ ఒడిదుడుకులను అధిగమిస్తూ అనుకున్నది సాధించాలి.

మీ పిల్లలకు చిన్నప్పటి నుండే తమకంటూ ఒక గోల్ ఉండాలని నేర్పించండి. వారికి మార్గనిర్దేశం చేస్తూనే లక్ష్యాన్ని స్వయంగా ఛేదించడానికి వారిని సంసిద్ధం చేయండి. మొక్కై వంగనిది మానై వంగదన్న విషయాన్ని గుర్తుంచుకుని పిల్లలకి చిన్న తనం నుండే మంచి అలవాట్లను అలవరచుకునేలా తీర్చిదిద్దండి. లక్ష్యం యొక్క విలువను, విశిష్టతను తెలియచేయండి. ప్రతి మనిషికి తమకంటూ ఒక లక్ష్యం ఉండాలి. పిల్లలే మన భవిష్యత్తు కాబట్టి వారిని పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇలాంటివి చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: