సింగర్స్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సింగర్ చిన్మయి శ్రీపాద. తన కెరీర్ తొలినాళ్లలో ప్రముఖ లిరిసిస్ట్ వైరాముత్తు తనను లైంగికంగా వేధించాడని చిన్మయి ఏడాది క్రితం షాకింగ్ ఆరోపణలు చేసింది. కానీ ఆ ఆరోపణలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఎవ్వరూ చిన్మయిని పట్టించుకోలేదు. పైగా ఆరోపణలు చేసినందుకు ఆమెను డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారు. తప్పు చేసిన వైరాముత్తుకే అందరూ మద్దతు పలుకుతున్నారు. 


దాంతో ఇలాంటి వారిని ఆ దేవుడే శిక్షిస్తాడనుకుని చిన్మయి మౌనంగా ఉండిపోయారు. అయితే ఇప్పుడు వైరాముత్తును కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. తమిళ భాషకు ఆయన చేసిన సేవను గౌరవిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్.. వైరాముత్తును సత్కరించనున్నారు. ఈ విషయం చిన్మయి దృష్టికి రావడంతో ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తొమ్మిది మంది మహిళల చేత ఆరోపణలు ఎదుర్కొన్న వైరాముత్తును రక్షణ శాఖ మంత్రి గౌరవ డిగ్రీతో సత్కరించనున్నారు. మరోసారి మీకు ఓ విషయాన్ని గుర్తుచేయాలని అనుకుంటున్నాను. ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఏమీ కాదు. చేసిన వారికే పని దొరక్కుండా చేస్తారు. తమిళ భాష పట్ల వైరాముత్తుకు ఉన్న పట్టును గుర్తించి ఈ డాక్టరేట్ ఇస్తున్నారని నాకు తెలుసు. 

 

అదే విధంగా ఉత్తమ కామాంధుడు అనే పురస్కారం కూడా ఇస్తారని ఆశిస్తున్నా.. "ఏడాది నుంచి చెప్తున్న మాటను మళ్లీ చెప్తున్నా. నేను చేసిన ఆరోపణలపై ఎవరూ విచారణ జరపకపోగా ఇప్పటికీ ఆయనకు అద్భుతమైన మల్టీస్టారర్ సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టేసి వస్తున్నాడు. పెద్ద పెద్ద వారితో స్టేజ్‌ను పంచుకుంటున్నారు. మంచి దేశం, మంచి ప్రజలు. ఇక నాపై కామెంట్స్ చేస్తున్నవారికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. 


మీ జీవితంలోనూ వైరాముత్తు లాంటి వ్యక్తి ఉంటే అప్పుడు నేనెంత బాధపడ్డానో తెలిసొస్తుంది. అనుభవాన్ని మించిన గురువు మరొకటి ఉండదు. నేను కేవలం న్యాయం కావాలని అడుగుతున్నాను. నా ఆరోపణలు విని ఓ కామాంధుడి ఫ్యాన్స్ ఎందుకు రియాక్ట్ అవుతున్నారో అర్థంకావడంలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చిన్మయి.

మరింత సమాచారం తెలుసుకోండి: