ఆడవాళ్ళ అందంలో జుట్టు కి ఎంతో ప్రాముఖ్యత ఉంది..పొడవైన, ఒత్తయిన జుట్టు కోసం మహిళలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.కానీ ఫలితం కనిపించడంలేదని బాధపడే ఆడవాళ్లకు కొన్ని రకాల టిప్స్ ఉన్నాయి.. అవేంటో తెలుసుకోండి.. మీ జుట్టును కాపాడుకోండి.. మన అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిది అని. కానీ తెలియని విషయం ఏంటంటే ఆకుకూరలు ఒంటికే కాదు జుట్టుకు కూడా చాల మంచివి అని. ఆకుకూరలతో  జుట్టుకూ నిగారింపు ఇవ్వొచ్చు తెలుసా.. చుండ్రు, జుట్టురాలడం తగ్గించుకునేందుకు ఇవి ఎంతోగానో ఉపయోగపడతాయి.ఇంకా ఆలస్యం చేయకుండా ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.. !!



ఒక గిన్నెలోకి  ఒక కప్పు పొన్నగంటి కూర, ఒక కప్పు గోరింటాకుపొడి, రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం, చుండ్రు  తగ్గుతుంది.అలాగె చుక్కకూర ఒక కప్పు, గోరింటాకు పొడి కప్పు, రెండు స్పూన్‌ల ముల్తాన మట్టీ, కప్పు పెరుగు బాగా కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి. దీనివల్ల జుట్టు నిగనిగలాడడమే కాదు, చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.



అలాగే మజ్జిగలో చింతచిగురు, గోరింటాకుపొడి ఒక్కొక్క కప్పు తీసుకొని దాంట్లో అరకప్పు శనగపిండిని కలపాలి. దాన్ని తలకు పట్టించాలి. 20నిమిషాల తర్వాత తలను కడిగేయాలి. ఇది జుట్టుకు మంచి కండీషనర్‌లా పనిచేస్తుంది. అయితే ఈ మిశ్రమాన్ని పెట్టుకునే ముందు తలకు నూనె పెట్టుకోవడం మర్చిపోవద్దు. ముందు తలకు నూనె పెట్టుకొని మర్దనా చేయాలి. ఇప్పుడు అవిసె ఆకులు రెండు కప్పులు, గోరింటాకు కప్పు, ఉసిరిపొడి అరకప్పు వేసి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇది వేడిని దూరం చేస్తుంది. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు బాధ కూడా తగ్గుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: