భారతీయ సంప్రదాయంలో పెళ్లి అనేది గొప్ప విషయం. ఎందులకంటే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ఎవరో తెలియకుండానే కొత్త జీవితం ప్రారంభిస్తారు. అయితే పెళ్లి కి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే హిందూ సంప్రదాయంలో మరో కీలక విషయం ఏంటంటే మీ పెళ్లిని రిజిస్టర్ చేసుకోవడం.. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు.. కేవలం రిజిస్టర్ మ్యారేజ్ లనే కాదు ఎలాంటి మ్యారేజ్ లు అయినా రిజిస్టర్ చేసుకోవాలి.. చేసుకోకుంటే కొన్ని కొన్ని ఎంతగానో మిస్ అవుతాము. రిజిస్టర్ చేసుకోవాలని సుప్రీమ్ కోర్టు కూడా పదే పదే చెప్తున్నా వినని వారు చాలామందే ఉన్నారు..

పెళ్లి తర్వాత ఏదైనా లీగల్ గా కావాలంటే ... పాస్ పోర్ట్ కావాలన్నా,, ఇన్ కం సర్టిఫికెట్ కావాలన్నా, బ్యాంకు అకౌంట్ తెరవాలన్నా, వేరే ఏదైనా చట్టపరమైన అనుమతులు కావాలన్నా ఈ రిజిస్ట్రేషన్ తప్పని సరి.. అందుకే చట్ట ప్రకారం పెళ్ళికి అనుమతి ఉన్నట్లు రిజిస్టర్ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.. హిందూ మ్రయేజ్ యాక్ట్ ప్రకారం కొన్ని ముఖ్యమైన సూచనలు ఇప్పుడు మనం చూద్దాం..

హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒకరు ఒక వ్యక్తి ని మాత్రమే పెళ్లాడాలి.. అబ్బాయికి 21 సంవత్సరాలు, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాతే పెళ్లి చేయాలి.. లేదంటే జైలు కి అర్హులు అవుతారు. HMA ప్రకారం కుల మత ప్రాంత బేధాలు లేకుండా ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. కులాంతర, మతాంతర వివాహాలను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పరిగణిస్తారు. వివాహం తర్వాత వదవు అత్తవారింటి వద్ద ఉండాలని చట్టం చెప్పట్లేదు కానీ ఏళ్ల తరబడి వస్తున్న ఆచారాన్ని ఆచరించమంటుంది. ఇల్లరికం ను వ్యతిరేకించదు..  వివాహం జరిగిన ఏడాదిలోపు ఏదైనా పరిస్థితుల రిత్యా విడిపోవాలనుకుంటే యాక్ట్ ఒప్పుకోదు..ఇద్దరి మధ్య రాజీ కుదర్చలేనంత పెద్ద సమస్యలు ఉన్నాయని ఒకవేళ కోర్టు భావిస్తే విడాకులు మంజూరు కావొచ్చు..కానీ చాలా తక్కువ సంధర్బాల్లో ఇలాంటి విడాకులు సాధ్యం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: