గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణులు ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలోకాలేయం క్యాన్సర్‌ కనిపిస్తుంటుంది. మన శరీరంలో అతి ప్రధానమైన అవయవం గుండె, మద్యం తరచుగా తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధులకు గురవుతారు. దీని ప్రభావం వలన రక్త సరఫరా సరిగా జరగదు.

ఇక ఆల్కహాల్ కారణంగా రక్తంలో కొవ్వు పదార్థం ఎక్కువగా పెరిగి తద్వారా రక్తపోటు పెరగడానికి కారణం అవుతుంది. రక్తపోటు అనేది మనిషికి ఎంత ప్రమాదమో తెలిసిన విషయమే. ఆల్కహాల్ ప్రభావం వలన శరీరంలో ఎంతో కీలకమైన వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తుంది. దీని మూలంగా ఎక్కువగా అంటు వ్యాధుల బారిన పడడం, ఏదైనా జబ్బు చేస్తే త్వరగా నయం కాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

అయితే ఆల్కహాల్, ప్రెగ్నెన్సీ కలిసి ప్రయాణం చేయలేవు. ఎంత తక్కువ ఆల్కహాల్ అయినా సరే, అది బేబీ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. గర్భవతులు, గర్భం ధరించడానికి ట్రై చేస్తున్న వారు ఆల్కహాల్ కి దూరంగా ఉండడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రెగ్నెంట్స్ ఆల్కహాల్ తీసుకుంటే అది బ్లడ్ స్ట్రీం లో కలిసి బేబీని చేరుతుంది. బేబీ ఆల్కహాల్ ని పెద్ద వారి కంటే స్లోగా బ్రేక్ డౌన్ చేస్తుంది, దాంతో తల్లి కంటే ఎక్కువ బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ బేబీలోనే ఉంటాయి.

అంతేకాదు ఆల్కాహాల్ వల్ల అబార్షన్స్ అవ్వడం, చనిపోయిన బిడ్డ పుట్టడం వంటి రిస్క్స్ ఉంటాయి. అలాగే, పుట్టిన బిడ్డ కూడా బరువు తక్కువగా ఉండడం, త్వరగా ఏదీ నేర్చుకోలేకపోవడం, క్లియర్ గా మాట్లాడలేకపోవడం వంటి సమస్యలు ఫేస్ చేయవ్లసి ఉంటుంది. బేబీ యొక్క సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని గర్భవతులు ఆల్కహాల్ కి దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: