
అయితే నిజానికి వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రోటీన్‌తో పోల్చితే.. అంతర్గతంగా ఉండే యాంటీ జెన్లు నెమ్మదిగా మ్యుటేట్ అవుతాయని అంటున్నారు. అంతేకాదు.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక చిన్నారులకు కూడా టీకా ఇచ్చేందుకు ట్రయల్స్ కొనసాగుతునాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తుంది. ఇక కోవిడ్ టీకాలను గర్భిణులకు ఇవ్వవచ్చు అని కేంద్ర ఆరోగ్యశాఖ తన మార్గదర్శకాల్లో సూచించిందని పేర్కొన్నారు.
సాధారణంగా గర్భిణులు కోవిడ్ బారిన పడటం వలన వారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే గర్భిణులు కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రెగ్నెంట్ మహిళలకు కూడా ఇవ్వాల్సిందేనని ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలియజేశారు. అంతేకాదు.. సార్స్ సీవోవీ2 వేరియంట్లు అయిన ఆల్పా, బీటా, గామా, డెల్టాలపై కోవీషీల్డ్, కోవాక్సిన్ టీకాలు పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక ప్రస్తుతం ప్రపంచంలో ఒకే ఒక దేశం పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తున్నట్లు ఐసీఎంఆర్ చీఫ్ వెల్లడించారు.
ఇక మరి చిన్న పిల్లలకు వ్యాక్సిన్ అవసరమా అన్నది ఇంకా తెలియని ప్రశ్నగానే మిగిలిపోయిందని ఆయన వెల్లడించారు. అయితే డేటా పూర్తిగా తెలియనంత వరకు.. పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వలేమని బలరామ్ భార్గవ్ తెలిపారు. ఇక దీనిపై తాము స్టడీ కూడా చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. అంతేకాదు.. 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో పరీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక వాటి ఫలితాలు సెప్టెంబర్ వరకు వస్తాయని అన్నారు.