అమ్మ చేతి వంట అంటే  ఇష్ట పడని వారు ఈ లోకంలో ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.అలాంటి అమ్మచేతి వంటతో జీవితంలో  విజయం సాదించి ఎంతో మంది వీక్షకులను పొందిన 'ఆవుల.భార్గవి' మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.రాజమండ్రిలో పుట్టి పెరిగిన భార్గవి బీఎస్సి కంప్యూటర్స్ పూర్తి అవగానే వారి తల్లిదండ్రులు డా.సుబ్బారెడ్డితో వివాహం   చేశారు.తర్వాత భార్గవి భర్తతో విశాఖపట్నంలో ఉండేది.2017 జనవరిలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన భార్గవితో తన తల్లి గీతమహాలక్ష్మి  "మనం చేసే వంటలను యూ ట్యూబ్ లో పెడితే చాలా మంది చూస్తారని,నేను వంట చేసి వీడియోలు తీస్తాను నువ్ వాటిని యూ ట్యూబ్ లో అప్ లోడ్ చెయ్యు" అని అనటంతో అమ్మ చేతి వంట యూ ట్యూబ్ చానల్ తొలి అడుగులు వేసింది.

అయితే వాటికి చెప్పుకోదగ్గ వ్యూస్ రాకపోవటంతో వీక్షకులను ఎలా పెంచుకోవాలి అని, వ్యూస్ ఎలా పెరుగుతాయి??టాగ్స్,టైటిల్,థంబ్ నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి అని విషయాలతో గాలించి,తెలుసుకొని ప్రొఫిషనల్గా వీడియోలు పెట్టడం మొదలుపెట్టారు.మొదటి నెలలో 90కి పైగా వీడియోలు పెట్టింది. భార్గవి పెట్టిన వీడియోలలో  దసరా నవరత్రులకి నైవేద్యం పెట్టె ప్రసాదం తయారి విడియోలకి ఉహించని స్పందన లబించింది.తర్వాత ఆనియన్ సమోసా,ఇన్స్టెంట్ టమోటా పచ్చడి,కేకులు,మంచురియా ఇలా ఒకటి ఏంటి తన చానల్ లో లేని వంటకం లేదు.అ తర్వాత తను వెనుతిరిగి చూడలేదు.

ప్రస్తుతం భార్గవి హైదరాబాదుకి తన కుటుంబంతో షిఫ్ట్ అయ్యారు."మనలో మన మాట" అనే ఇంకో చానెల్ను స్టార్ట్ చేసి అందులో తన డాక్టర్ భర్తతో కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,నుట్రిషిన్ ఫుడ్ గురించి ప్రజలకు ఉపయోగపడే వీడియోలు  పెడుతున్నారు. వీక్షకులు పెరగటంతో యూ ట్యూబ్ సిల్వర్ బటన్,గోల్డ్ ప్లే బటన్లతో భార్గవిని సత్కరించింది." నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే యూ ట్యూబ్ ఛానల్ ని నడపగలుగుతున్నాను.యూట్యూబ్లోవంటకాలు మనం చేస్తే సరిగ్గా రావు' అని జనాల్లో వున్నాఅభిప్రాయం పోయి వంటలు బాగా వస్తున్నాయి అని పోస్టులు చూస్తే పడిన కష్టం అంతా మరిచిపోతాను అంటున్నారు భార్గవి.కొత్తగా చానెల్ పెట్టిన వారు వ్యూస్ రావటం లేదని నిరాశ పడకూడదని,మంచి కాంటెంట్ ఉంటే వీక్షకులు పెరుగుతారని భార్గవి సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: