
కొంతమంది నల్ల దారం ధరించడం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయని, డబ్బు చేతిలో నిలుస్తుందని ఎలాంటి కష్టాలు రావని ఫీలవుతారు. నల్ల దారం ధరించడం వల్ల శరీరంలో నెగటివ్ ఎనర్జీ తగ్గి, పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం పెరుగుతుందని శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందని భావిస్తారు. నలుపు రంగు శని గ్రహానికి సంబంధించింది కాబట్టి, నల్ల దారం ధరించడం వల్ల శని దేవుని అనుగ్రహం లభిస్తుందని ఫీలవుతారు.
అయితే కొంతమంది జ్యోతిష్యులు నల్ల దారం ధరించడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు. అందువల్ల నల్ల దారం ధరించే వాళ్ళు కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. మేష రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశులలో జన్మించిన వాళ్ళు మాత్రం కాలికి నల్ల దారం కట్టుకోకూడదు. ధనుస్సు రాశికి నలుపు శుభప్రదం కాదు. అందువల్ల ఈ రాశి వాలు నల్ల దారానికి దూరంగా ఉండాలి.
శనికి, కుజుడికి మధ్య వైరం వల్ల మేష రాశి వాళ్ళు నల్ల దారం కట్టుకోకూడదు. వృశ్చిక రాశికి సైతం అధిపతి కుజుడు కాగా ఈ రాశి వాళ్లకు సైతం నల్ల దారం కట్టుకోవడం వల్ల అనుకూల ఫలితాల కంటే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశికి గురువు అధిపతి కాగా గురువుకు సైతం నలుపు రంగు వల్ల చెడు ఫలితాలు కలుగుతాయి. నల్ల దారం కట్టుకోవడం వల్ల లాభాలు ఉన్నాయని శాస్త్రాలు సైతం చెబుతున్నాయి.