ఇండియాకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన ఫోర్స్ మోటార్స్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త 2021 ఫోర్స్ గూర్ఖా (Force Gurkha) ఎస్‌యూవీ కార్ కి సంబంధించి కంపెనీ తాజాగా మరో కొత్త టీజర్ ను విడుదల చేయడం జరిగింది.ఇక ఆఫ్-రోడ్ వాహన ప్రియులను ఎంతగానో అలరించేందుకు వస్తున్న ఈ నెక్స్ట్ జనరేషన్ ఫోర్స్ గూర్ఖ ఈ విభాగంలో నేరుగా మహీంద్రా థార్ తో గట్టిగా పోటీపడనుంది. ఇక మునుపటి తరం Gurkha తో పోల్చుకుంటే, ఈ కొత్త తరం 2021 Gurkha ను కంపెనీ  చాలా రెట్లు మెరుగ్గా ఉండేలా రూపొందించడం జరిగింది.ఇక కరోనా మహమ్మారి ఆంక్షల కారణంగా చాలా కాలం వాయిదా పడుతూ వచ్చిన ఈ కొత్త 2021 Force Gurkha ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ కార్ త్వరలోనే ఇండియా మార్కెట్లోకి రానుంది. మహీంద్రా కంపెనీ విడుదల చేసిన తమ కొత్త తరం థార్ ఎస్‌యూవీ కార్ మాదిరిగానే ఈ కొత్త తరం ఫోర్స్ గుర్ఖా కుడా ఇటు ఆన్-రోడ్ ఇంకా అటు ఆఫ్-రోడ్ ప్రయోజనాల కోసం రూపొందించినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.

Force Motors గత సంవత్సరం ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో తమ కొత్త తరం Gurkha ఎస్‌యూవీ కార్ ని ఆవిష్కరించడం జరిగింది. ఇక ఈ ప్రీ-ప్రొడక్షన్ వెర్షన్‌ కు అలాగే కంపెనీ త్వరలో విడుదల చేయనున్న మోడల్ కి అనేక పోలికలు ఉన్నట్లు ఈ టీజర్ ఫొటోలు ఇంకా వీడియోలను చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది.ఇక పాత తరం Gurkha కార్ తో పోలిస్తే, ఈ కొత్త తరం 2021 Force Gurkha కార్ డిజైన్, ఫీచర్స్ ఇంకా టెక్నాలజీ పరంగా చాలా మెరుగ్గా ఉంటుంది. అలాగే తాజాగా విడుదల చేసిన కొత్త టీజర్ ఇమేజ్ ప్రకారం ఈ కొత్త 2021 Gurkha ఎస్‌యూవీ కార్ ఒక స్నార్కెల్ ఇంకా ఫంక్షనల్ రూఫ్ క్యారియర్‌తో వస్తుందని తెలుస్తోంది. ఇక దీని ఓవరాల్ డిజైన్ పాత వెర్షన్ల కంటే కూడా చాలా మెరుగైనదని చెప్పబడింది.కార్ పై రీడిజైన్ చేసిన బోనెట్, ఫెండర్‌పై కొత్తగా రీడిజైన్ చేయబడిన గ్రిల్ ఇంకా ఎయిర్ ఇంటేక్ స్నోర్కెల్ వంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే, మునుపటి స్పై షాట్లు ఇంకా అలాగే విడుదలైన బ్రోచర్ చిత్రాల ఆధారంగా, ఈ ఎస్‌యూవీ కార్ అదే ఓవరాల్ బాక్సీ సిల్హౌట్‌ను నిలుపుకునే అవకాశం ఉందని ఇక్కడ తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: