కాఫీ.. ఉదయం లేవగానే ఒక కప్పు తాగితే చాలు.. మైండ్ ఫ్రెష్ గా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాము. అలాంటి ఈ కాఫీ కేవలం మైండ్ కే కాదు అందానికి కూడా ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. కాఫీతో చర్మసౌందర్యాన్ని పెంచుకోవచ్చు. కాస్మెటిక్స్ లాంటివి ఏవి ఉపయోగించకుండా కేవలం కాఫీ పౌడర్ తో అందాన్ని సహజసిద్ధంగా పెంచుకోండి. ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


మృతకణాలు.. కాఫీ గింజలు సహజ ఎక్స్‌ఫోలియేట్‌గా పనిచేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో కాఫీ బాడీ స్క్రబ్స్‌ కూడా లభిస్తున్నాయి. కాఫీలోని కఫెయిక్‌ ఆసిడ్‌ కొల్లాజెన్‌ ఉత్పత్తికి దోహదపడుతుంది. చర్మం మీది మృతకణాలను తొలగిస్తుంది. అందుకే కాఫీ గింజలు వాడటం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 


మాయిశ్చరైజర్‌గా: పెరుగు, తేనె రెండు టేబుల్‌ స్పూన్లు, కాఫీ పొడి నాలుగు టేబుల్‌ స్పూన్ల కలిపి ఆ పేస్ట్ ని ముఖానికి రాసుకొని అరగంట తరువాత చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చెయ్యడం ద్వారా చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. 


టీ స్పూన్ తేనె, కాఫీ పౌడర్, నిమ్మరసం కలిపి ఆ పేస్ట్ ని ముఖానికి అప్లయ్ చేయాలి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ముఖాన్ని కడగాలి. దీని వల్ల రక్తప్రసరణ బాగా జరిగి విటమిన్ సీ వల్ల మరింత ఫ్రెష్‌గా కనిపిస్తారు.


ఆలివ్ ఆయిల్, కాఫీ పౌడర్ కలిపి ఆ పేస్ట్ ని ముఖానికి రాసుకొని పది నిమిషాల పాటు ఉంచి కడిగితే చర్మం పొడిబారదు.


మరింత సమాచారం తెలుసుకోండి: