అందమైన చర్మం కోసం అంద‌రూ ఆరాట‌ప‌డుతుంటారు. దీని కోసం ఎన్నో ప్ర‌యోగాలు చేస్తుంటారు. అయితే ముల్తానీ మిట్టి చర్మ సౌందర్యాన్ని పెంచే ముఖ్య సాధనాల్లో ఒకటిగా నేడు చలామణి అవుతోంది. దీనిలో చర్మ సౌందర్యాన్ని పెంచే మంచిగుణాలున్నాయి. కేవలం చర్మం మాత్రమే కాదు కేశ సౌందర్యాన్ని కూడా పెంచేందుకు అద్భుతంగావుపయోగపడుతుంది. ముల్తానీ మిట్టిలో ఉండే అధిక ఖనిజాలు చర్మాన్ని శుభ్రపరచడానికి మరియు చర్మాన్ని సంరక్షించడానికి సహాయపడతాయి.

 

దీని కోసం ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, దోసకాయ గుజ్జు మరియు శనగపిండిని తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని కాస్త స‌మ‌యం త‌ర్వాత క్లీన్ చేసుకుంటే స‌రిపోతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. ముల్తానీ మట్టి, తేనే, పసుపుతో చేసిన ప్యాక్ మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతేకాకుండా మొటిమలను తొలగించ‌డంలో ఇది చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే   ముల్తానీ మిట్టిని కొద్దిగా నీటితో కలుపుకోవాలి. దీన్ని మెత్తటి క్రీం లాగా తయారు చేసుకుని ముఖానికి పట్టించుకోవాలి.

 

తొందరగా చెమట పట్టే వారికి ముఖం తొందరగా వాడిపోయినట్లు అవుతుంది. అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ముల్తానీ మిట్టిని చర్మ రకాన్ని బట్టి నీటితో లేదా గులాబీ నీరుతో కూడా కలిపి ముఖంపై మాస్క్‌లా వేసుకోవచ్చు. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగితే ముఖం కాంతి వంతంగా అయిపోతుంది. అదే విధంగా ముల్తానీ మిట్టిలో పెరుగు క‌లిపి ఫేస్ ప్యాక్ వేసుకుని ఇర‌వై నిమిషాల త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చర్మంలో మచ్చలు మరియు గాయాల వల్ల ఏర్పడన మచ్చలను తొలగిస్తుంది. దీంతో పాటు చర్మాన్ని మృదువుగా కూడా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: